Telugu

ఉద్యోగాల భర్తీ అంటే వాలంటీర్లు కాదు నాయినా.. డీఎస్సీ!

జగన్‌ ఉద్యోగాల భర్తీ అంటే వాలంటీర్లు, రేషన్ బియ్యం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ ఉద్యోగులని అనుకుంటూ తన హయంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించానని గొప్పగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.

కానీ ఉద్యోగాల భర్తీ అంటే ప్రభుత్వంలో లేదా ప్రభుత్వ పాఠశాలలో అని అంగీకరించరు. ఎందువల్ల అంటే సంస్కరణలు, ప్రక్షాళన పేరుతో విద్యావ్యవస్థని అస్తవ్యస్తం చేయగలిగారు కానీ డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారు కనుక.

ADVERTISEMENT

అయితే 2024 ఎన్నికలు దగ్గర పడినప్పుడు నిరుద్యోగ యువత ఓట్లకు గాలం వేసేందుకు హడావుడిగా డీఎస్సీ ప్రకటించారు. కానీ జగన్‌ ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీలో చిత్తశుద్ధి లేదనే విషయం అప్పటికే అందరికీ అర్దమైంది కనుక వైసీపీ డీఎస్సీ ఉచ్చులో ఎవరూ పడలేదు.

కానీ తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామనే చంద్రబాబు నాయుడు హామీని యువత నమ్మారు. అందుకే గెలిపించారు.

వారికిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తోంది కూడా. మొత్తం 3,36,305 మంది అభ్యర్ధులు 5,77,675 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈ డీఎస్సీ ప్రకటన కోసం 3.36 లక్షల మంది ఎదురుచూస్తున్నారనే కదా?

ఈ డీఎస్సీ ప్రక్రియని నెలల తరబడి సాగయగీయకుండా మూడు నెలల్లో పూర్తిచేసి అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినందున, అధికారులు కూడా తదనుగుణంగానే షెడ్యూల్‌ రూపొందించుకొని ఈ ప్రక్రియని పూర్తి చేయబోతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Married Heroines & Intimate Scenes: Double Standards?

For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…

25 minutes ago

Pics: Mahira Gives Black Fashion A Playful Twist!

Mahira Sharma gives the all black trend a fresh, flirtatious spin with a fitted crop…

46 minutes ago