Telugu

రావాలి మద్యం… కావాలి మనీ ..! ఇదే జగనన్న ప్రజా ప్రభుత్వం..!

2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన అన్ని హామీలకు మూలాధారం ఈ మద్యం అమ్మకాల వల్ల వచ్చే ఆదాయమే అని జగన్ అసెంబ్లీ సమావేశాలలో
పరోక్షంగా చెప్పకనే చెప్పారు. అయితే జగన్ ఒక విషయం మరిచినట్లున్నారని జగన్ ను సోషల్ మీడియా కేంద్రంగా ఒక ఆట ఆడుకుంటున్నారు టీడీపీ శ్రేణులు.

విషయాన్ని వస్తే.., జగన్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం “మద్యనిషేధం” చేస్తాం., అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు తెస్తాం అని జగన్ ఇచ్చిన హామీ. అయితే ఇప్పుడు ఇదే జగన్ పాలిట శాపంలా., ప్రతిపక్షాలా పాలిట వరంగా మారింది.

ADVERTISEMENT

చంద్రబాబు సందుకో బెల్ట్ షాప్.., వీధికో వైన్ షాప్ తీసుకువచ్చారు., మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అసలు రాష్ట్రంలో మద్యం అనే మాటే వినపడదు అని జగన్ గత ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లకు ‘మాట’ ఇచ్చారు. జగన్ “మడం తిప్పం – మాట తప్పం” నినాదాన్ని పూర్తిగా విశ్వసించారు కాబట్టే తిరుగులేని మెజారిటీ కట్టపెట్టారు.

గడిచిన వారం రోజులుగా ‘కల్తీ మద్యం’..,’జే ‘ బ్రాండ్స్.., ‘సారా మరణాలు’ అంటూ అటు అసెంబ్లీలోనూ., ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మద్యం బ్రాండ్లను., చీప్ లిక్కర్ అంటూ, నాటుసారా బ్రాండ్లుగా ముద్ర వేసేందుకు టిడిపి ప్రయత్నిస్తుందని., రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించేందుకే ఈ తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అంటూ టీడీపీ పై జగన్ ఎదురుదాడి చేశారు.

మద్యం ద్వారా డబ్బులు వచ్చాయంటే అక్క చెల్లెమ్మలు జగన్ మంచి చేస్తాడని., ఆ మంచి జరగకూడదనే చంద్రబాబు ఆలోచన అంటూ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి ఆదాయం రాకూడదు.., అప్పులు పుట్టకూడదనేదే చంద్రబాబు దురాలోచన అంటూ అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ముగించారు జగన్. ఇప్పుడు ఇదే టిడిపి తన అస్త్రంగా వాడుకుంటూ జగన్ ను ఇరుకున పెట్టే పనిలో బిజీగా ఉంది.

“భార్యకు పధకాలు ఇవ్వడానికి భర్త ప్రాణాలతో చెలగాటం” అంటూ కాల్వ శ్రీనివాసులు .., “సంపద సృష్టించడం చేత కాకా లిక్కర్ అమ్మి సంక్షేమం చేస్తానంటున్నావా?” అంటూ అనిత.., “మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ఆడపడుచులకు సంక్షేమ పధకాలు అని నిర్లజ్జగా చెప్పడం చూస్తుంటే నువ్వు ఇంత దిగారిపోయావా జగన్” అంటూ అయ్యన్న ఇలా టీడీపీ తన మహిళా నేతలతో కలసి జగన్ పై సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

‘ఆడపడుచుల సంక్షేమం అంటే ప్రభుత్వాలు పంచే సొమ్ము కాదు ., సంక్షేమం అంటే తనకు., తన కుటుంభానికి ఒక భరోసా కల్పించడమే’ అంతే కానీ మీ భర్త ప్రాణాల తో …, మీకు చిల్లర పంచుతా… అంటే రాష్ట్రంలో నే కాదు ఎక్కడ ఏ మహిళా ఇందుకు అంగీకరించదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో జగన్.! అంటూ రాష్ట్రంలో ప్రతిపక్ష మహిళా నేతలు జగన్ ను హెచ్చరించారు.

రాష్ట్రములోకి “కల్తీ బ్రాండ్ల మద్యం రావాలి., ఆదాయం కావాలి., అప్పులు పుట్టాలి., ప్రజల ప్రాణాలు పోవాలి…” ఇప్పుడు రాష్ట్రంలో జగన్ ఎంచుకున్న కొత్త పాలసీ ఇదే అంటూ వైసీపీ నాయకులను., అధినేతను కాస్త గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు టిడిపి సోషల్ మీడియా ప్రచారకర్తలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Simran Dhanwani Sizzles In Bold Red Saree Look

Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…

23 minutes ago

మోడీజీ… అలా భయపెట్టకండి!

ప్రధాని మోడీ నేడు సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ఆటంబాంబు లాంటి మాట చెప్పారు. కనీసం ఒక ఏడాది…

50 minutes ago