
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ తో జరిపిన సమావేశంలో బాబు కొన్ని కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో దేవాలయాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.
అయితే ఇప్పటికి రాష్ట్రంలో 23 ప్రముఖ పుణ్య క్షేత్రాలలో 7 ప్రధాన ఆలయాలలో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని, ఆ మిగిలిన 16 దేవాలయాలలో కూడా భక్తులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటూ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కి, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు.
ప్రస్తుతం ఏపీలో తిరుమల శ్రీవారి ఆలయం తో పాటుగా బెజవాడ దుర్గమ్మ, కాణిపాకం సిద్ది వినాయక, శ్రీశైలం మల్లన్న, శ్రీ కాళహస్తి శివయ్య, ద్వారకా తిరుమల వెంకన్న, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్య దేవుని ఆలయాలలో దేవుని దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఈ నిత్యా అన్నదానం అమలులో ఉంది.
ఇక రాబోయే రోజులలో మరికొన్ని పుణ్య క్షేత్రాలలో ఈ సదుపాయాన్ని భక్తులకు అందుబాటులో ఉంచాలని, అందుకు అవసరమైన నిధులను ఆ 7 ప్రధాన ఆలయాల నుంచి సమకూర్చుకోవాలంటూ బాబు అధికారులను ఆదేశించారు. దీనితో పుణ్య క్షేత్రాలకు వెళ్లనున్న భక్తులకు కూటమి ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పినట్టయింది.
అలాగే ఈ మధ్య కాలంలో దేవాలయాలలో జరుగుతున్న ఊహించని దుర్ఘటనల మీద, అటు తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల టోకెన్ల సమయంలో జరిగిన తొక్కిసలాట, తద్వారా సంభవించిన భక్తుల మరణాలు, ఇటు తాజాగా అక్షయ తృతీయ సందర్భంగా సింహాచలం అప్పన్న ఆలయం వద్ద గోడ కూలిన ఘటన, ఆ పై జరిగిన ప్రాణ నష్టం మీద కూడా బాబు అధికారులకు గట్టి హెచ్చరికలు పంపారు.
ఇక ముందు ఇటువంటి సంఘటనలు పునారవృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, దేవాలయాలకు వస్తున్న భక్తులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన విధి సంబంధిత ఆలయ అధికారులదే అనేలా సంకేతాలు పంపారు. ఇకనైనా అధికారులు, దేవాదాయ సిబ్బంది కాస్త అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని భక్తులు ఆశిస్తున్నారు.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…