ఏపీకి పరిశ్రమలు రావాలంటే ముందు….

ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ‘ఎయిర్ బస్’ ప్రస్తుతం భారత్‌లో హెచ్ 125 మోడల్ హెలికాఫ్టర్ల అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకి అనువైన రాష్ట్రం, ప్రదేశం కొరకు వెతుకుతోంది. దానిపై ఎయిర్ బస్ సంస్థ వేలకోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. దాంతో పాటు దాని అనుబంద పరిశ్రమలు కూడా వస్తాయి. ఈ ఒక్క హెలికాఫ్టర్‌ యూనిట్ ఏర్పాటైతే దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి.

ADVERTISEMENT

కనుక దేశంలో పలు రాష్ట్రాలు దీనిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. వాటిలో ఏపీ కూడా. దానికి అనంతపురం-బెంగళూరు మద్యన గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద 250 ఎకరాలు కేటాయించేందుకు ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సంసిద్దత తెలిపారు.

కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ దానిని పట్టించుకోకపోగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించారు. అది చూసి ఏ పెట్టుబడిదారుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సాహసించలేరు. కనుక ఎయిర్ బస్ కూడా వెనకడుగువేసింది.

జగన్‌ ఇప్పుడు అధికారంలో లేనప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేసి జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఇదే చెప్పబోతున్నారు.

కనుక సిఎం చంద్రబాబు నాయుడుకి ఎంత మంచి పేరున్నప్పటికీ జగన్‌ చేసిన, చేస్తున్న ఈ నిర్వాకం వలన పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడం చాలా కష్టమవుతుంది. కనుక ముందుగా ఈ దుష్ప్రచారాన్ని అత్యవసరంగా ఏదోవిదంగా కట్టడి చేయవలసి ఉంటుంది

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

3 hours ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

4 hours ago