మద్యం కుంభకోణం: అక్టోబర్‌లో క్లైమాక్స్ సీన్స్?

ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ నెలాఖరులోగా విచారణ ముగించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ప్రధాన సూత్రధారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే అని ఇటీవల దాఖలు చేసిన అనుబంద ఛార్జ్ షీట్‌లో పేర్కొనందున, అందుకు తగిన బలమైన సాక్ష్యాధారాలను ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT

కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. కనుక సిట్ అధికారులు అయనపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు.

కనుక మద్యం కుంభకోణంపై సమగ్ర నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తే, దానిపై మంత్రివర్గ సమావేశంలో, ఆ తర్వాత శాసనసభలో చర్చించవచ్చు.

ఆ తర్వాత సిట్ అధికారులు జగన్‌కి నోటీస్ పంపించి విచారించేందుకు ప్రభుత్వం అనుమతించవచ్చు. కానీ జగన్‌ని అరెస్ట్‌ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

గతంలో జగన్‌ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసినందుకే ఆ కేసు వీగిపోయింది. కనుక జగన్‌ అరెస్ట్‌ చేసేందుకు కూటమి ప్రభుత్వం తొందరపడకుండా ముందుగా గవర్నర్ అనుమతి తీసుకుంటుంది.

కానీ అంతకంటే ముందుగా మోడీ, అమిత్ షాల అనుమతి చాలా అవసరం. వారు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తేనే గవర్నర్ అనుమతిస్తారు.

కనుక దీని కోసం సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి రాక తప్పదు. కనుక శాసనసభ సమావేశాల తర్వాత ఆయన ఢిల్లీ పర్యటన వైసీపీ దాని అధినేత జగన్‌కి చాలా కీలకం కావచ్చు.

జగన్‌కి కూడా ముంఈ విషయం బాగా తెలుసు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో అక్రమాల స్టోరీ ఎలాగూ సిద్దం చేసి ఉంచుకున్నారు. కనుక కూటమి ప్రభుత్వం సిట్ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టగానే, ఆ పేరుతో ధర్నా చేసేందుకు లేదా రాష్ట్రపతిని కలిసే వంకతో ఢిల్లీ బయలుదేరావచ్చు. అవునో కాదో రాబోయే రెండు నెలల్లోచూడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

1 hour ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

2 hours ago