
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి స్థానిక సంస్థల ఎన్నికలలో దూకుడుగా వ్యవహరిస్తుంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూటమి పార్టీల కంటే చాలా దూకుడుగా వ్యవహరిస్తుండటం విశేషం.
ఈ ఎన్నికలలో అధికార ప్రతిపక్షాల అభ్యర్ధులు నామినేషన్లు వేయలేకపోయినచోట్ల 48 గంటలు గడువు పొడిగించాలని సుప్రీంకోర్టు నేడు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్స్‌లలో కూడా మళ్ళీ ఇలాగే జరుగుతుండటం గమనార్హం.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోటగా పేర్కొనబడే అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో మళ్ళీ ఇరువర్గాల మద్య దాడులు జరిగాయి.
పల్నాడు జిల్లా రొంపిచర్లలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి (వైసీపీ) 300 మందిని వెంటబెట్టుకొని నామినేషన్స్ వేసేందుకు వచ్చారు. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించబడి ఉంది.
ఈ విషయం తెలిసే ఉన్నా అయన అంతమందిని వెంటబెట్టుకొని వచ్చి తమని అడ్డుకున్న పోలీసులతో గొడవ పడ్డారు. ఆ తర్వాత అయన అనుచరులు వారిపై రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో నరసనరావుపేట అర్బన్ సీఐ గాయపడ్డారు. ఆయనను గాయపరిచినందుకు పోలీసులు ఆయనతో సహా కొంతమందిపై కేసు నమోదు చేశారు.
ఈ ఎన్నికలలో అల్లర్లు, దౌర్జన్యాలు తప్పవని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారు. అయితే అవన్నీ సిఎం చంద్రబాబు నాయుడు చేయిస్తారని, అయినా వైసీపీ శ్రేణులు ధైర్యంగా వారిని ఎదుర్కొని పోరాడాలని, జగన్ ముందే పార్టీ శ్రేణులకు ఉపదేశం చేశారు. కనుక ఈ అల్లర్లు వైసీపీ వ్యూహంలో భాగమేనని అనుమానించక తప్పడం లేదు.
ఏ రాష్ట్రంలోనైనా అల్లర్లు, విధ్వసం జరిగితే ఆ అప్రదిష్ట అధికార పార్టీ మెడకే చుట్టుకుంటుంది. అందరూ దానినే నిందిస్తారు.
కనుక ఏపీలో ఎంతగా అల్లర్లు జరిగి, ఎంతగా పోలీసులు లాఠీఛార్జి చేస్తే అంతా కూటమి ప్రభుత్వానికే అప్రదిష్ట. అలాగని పోలీసులు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేసినా వీటన్నిటికీ కూడా సిఎం చంద్రబాబు నాయుడే బాధ్యులని నిందించడం సులభం.
పనిలో పనిగా హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ సొంత మీడియాతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిందంటూ దుష్ప్రచారం చేయడం కూడా వైసీపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయి.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా ఇంత దూకుడుగా వ్యవహరిస్తుంటే, దాని ఈ ఎత్తులను గుర్తించి పై ఎత్తులు వేసి చిత్తుచేయడానికి కూటమి ప్రభుత్వం శ్రమించాల్సివస్తోంది.
కూటమిలో సీట్లసర్డుబాట్ల విషయంలో జనసేనతో ఏర్పడిన సమస్యలకు తోడు, వైసీపీ విసురుతున్న ఈ సవాళ్ళను కూడా ఎదుర్కోవలసి వస్తోంది. అన్ని వైపులా తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటూనే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయం సాధించాల్సి ఉంది.
అంటే కూటమి ప్రభుత్వం వైసీపీకి కాదు.. అదే కూటమి ప్రభుత్వానికి పరీక్షలు పెడుతోందన్న మాట!
India will begin their New Zealand tour with a five match T20I series on October…
Prabhas fans finally have an update on Fauzi ahead of the actor’s birthday on October…