Telugu

స్థానిక ఎన్నికలు ‘బలాల’ కంటే ‘బంధాలకు’ కొలమానం కానున్నాయా.?

ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల హడావుడి అధికార – ప్రతిపక్షాల మధ్య బలా బలాలకు ఎలా అయితే కొలమానం కానుందో అలాగే టీడీపీ, జనసేన పార్టీల మధ్య మిత్ర బంధానికి కూడా అంతే కొలమానం కానుంది అనేది యదార్ధం.

వైసీపీ, టీడీపీ మధ్య ఉండే రాజకీయ విభేదాలు, ఆయా పార్టీల నాయకుల మధ్య సాగే రాజకీయ దాడులు అందరు ఉహించనవే. అలాగే ఆ రెండు పార్టీల రాజకీయ బలా బలాలు కూడా అందరికి తెలిసినవే. వైసీపీ రాజకీయ బలమెంత టీడీపీ పొలిటికల్ పవర్ ఏంటి అనేదాని మీద అందరికి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది.

ADVERTISEMENT

కానీ టీడీపీ, జనసేన పార్టీల మధ్య 2024 ఎన్నికల ముందు కలిసిన రాజకీయ పొత్తును ఇరు పార్టీల శ్రేణులు ఎంతకాలం సజావుగా, సాఫీగా ముందుకు తీసుకెళ్లగలవు అనేదే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించే అంశం. అయితే ఈ అంశం మీదే వైసీపీ రాజకీయ ప్రయాణం, రాజకీయ భవిష్యత్ రెండు కూడా ఆధారపడి ఉందనేది జగమెరిగిన సత్యమే.

ఇటువంటి పరిస్థితులలో ఈ రెండు పార్టీల శ్రేణులు ఆ బంధాన్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లగలవు.? ఎంత సుదీర్ఘ కాలం ఆ బంధాన్ని కొనసాగించగలవు.? రెండు పార్టీల మధ్య ఏర్పడిన కూటమి ని ఎంత కాలం పటిష్టంగా ఉంచగలవు.? ఇలా అనేక ప్రశ్నలకు స్థానిక ఎన్నికలు కొలమానం కానున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన పసుపు, కుంకుమ మాదిరి కలిసి ప్రజల ముందుకెళ్లాయి. దాని ఫలితం కూడా అదే స్థాయిలో కనిపించింది. ఇరు పార్టీల ఉమ్మడి లక్ష్యం ఒక్కట్టే అన్నట్టుగా క్షేత్ర స్థాయి నుంచి పార్టీ అధిష్టాన స్థాయి వరకు కూడా అందరు ఒక్కటిగా కలిసి పనిచేసారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము అనే ఉమ్మడి లక్ష్యం దిశగా ముందుకుసాగారు. కానీ ఇప్పుడు అధినేతల స్థాయిలో అదే పరిస్థితి కనిపించినా గ్రౌండ్ లెవెల్ లో ఆ పరిస్థితులు ఉన్నాయా.? వైసీపీ వ్యతిరేక ఓటు చీలిక జరిగిందా.? టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ ఫర్ అయ్యిందా.?

ఇరు పార్టీల క్యాడర్ ఉమ్మడి ప్రత్యర్థి కోసం బరిలోకి దిగారా.? నాటి మిత్ర బంధం నేటికీ చెక్కుచెదరకుండా ఉండగలిగిందా.? టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా యుద్దాలన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ మాదిరే ముగిసాయా.? ఇలా అనేక ప్రశ్నలకు స్థానిక ఎన్నికలు, వాటి ఫలితాలు కొలమానం గా నిలవనున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Meenakshi Chaudhary Owns The Midnight Blue Mood

Meenakshi Chaudhary brings midnight glamour to life in a sculpted navy gown that knows exactly…

15 minutes ago

KH×RK: A Feel-Good Homage for Rajini and Kamal?

Ever since the announcement glimpse of Kamal Haasan and Rajinikanth's reunion project, tentatively titled KH×RK…

46 minutes ago