Telugu

వైసీపీ ఎంత హడావుడి చేసినా రెండో దశలో కూడా అక్కడే!

వైసీపీ మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఎంత హడావుడి చేసిందో అందరూ చూశారు. రెండో దశలో కూడా అంతకంటే కాస్త ఎక్కువే హడావుడి చేసింది. కానీ దాని పరిస్థితి ఏమాత్రం మారినట్లు లేదు.

ఇప్పటి వరకు 1543 వెలువడిన ఫలితాలలో టీడీపి మద్దతు ఇచ్చినవారు: 1,202 మంది, జనసేన: 98, బిజేపి: 13, వైసీపీ: 181, ఇతరులు 49 సర్పంచ్ పదవులు దక్కించుకున్నారు.

ADVERTISEMENT

ముఖ్యంగా కాకినాడ, పశ్చిమ గోదావరి, మార్కాపురం, అన్నమయ్య జిల్లాలలో వైసీపీ ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

తిరుపతి జిల్లాలో 373 పంచాయతీలలో టీడీపి ఏకంగా 133 గెలుచుకోగా వైసీపీ కేవలం 9 మాత్రమే గెలుచుకోగలిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మొత్తం 297 పంచాయతీలలో టీడీపి 106 గెలుచుకోగా వైసీపీ కేవలం 7 మాత్రమే గెలుచుకుంది.

కడప కంచుకోటలో మాత్రం ఈసారి పరువు దక్కించుకుంది కానీ అక్కడా టీడీపి ధాటిని తట్టుకోలేకపోయింది.

కడపలో మొత్తం 202 పంచాయతీలకు టీడీపి 115 గెలుచుకోగా వైసీపీ 31 పంచాయతీలు గెలుచుకోగలిగింది.

పల్నాడు, అనంతపురం జిల్లాలలో వైసీపీ ఎంత హడావుడి చేసినప్పటికీ టీడీపికి ఎదురు నిలవలేకపోయింది. పల్నాడులో మొత్తం 150 పంచాయితీలకు టీడీపి 86, వైసీపీ 14 గెలుచుకుంది.

అనంతపురం జిల్లాలో మొత్తం 186లో టీడీపి 56 వైసీపీ కేవలం 12 మాత్రమే ఇంతవరకు గెలుచుకున్నాయి.

ఇక ఈ ఎన్నికలకు ముందు చిన్న శ్రీను వైసీపీలో నుంచి వెళ్ళిపోవడం విజయనగరం జిల్లాలో వైసీపీకి తీవ్ర నష్టం కలిగించాయని గణాంకాలే చెపుతున్నాయి.

జిల్లాలో మొత్తం 308 పంచాయతీలలో ఇంతవరకు ప్రకటించిన ఫలితాలలో టీడీపి 84 గెలుచుకోగా వైసీపీ 14 మాత్రమే గెలుచుకోగలిగింది.

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మొత్తం 383 పంచాయతీలకు నేడు ఎన్నికలు జరుగగా ఇంతవరకు ప్రకటించిన ఫలితాలలో టీడీపి 60, వైసీపీ కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది.

ఈ లెక్కన మొన్న జరిగిన శ్రీకాకుళం మేయర్‌ ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. టీడీపితో మూడు నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకొని గుండ లక్ష్మి వైసీపీలో చేరి మేయర్‌ పదవికి పోటీ చేశారు. ఆమెపై కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దానేటి రాధారాణి జనసేన అభ్యర్ధిగా పోటీ చేశారు.

శ్రీకాకుళంతో సహా నాలుగు మునిసిపల్ కార్పోరేషన్ మేయర్‌ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఆ నాలుగూ కూడా కూటమి పార్టీలు గెలుచుకుంటే కూటమి గెలుపు, వైసీపీ ఓటమి పరిపూర్ణం అవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నాడు డీఎంకేకి కాంగ్రెస్‌ హ్యాండ్ ఇస్తే నేడు…

డీలిమిటేషన్‌ బిల్లు ఇంకా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టక మునుపే దేశంలోని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ సమీకరణాలు మారిపోయేలా చేస్తోంది. దీనిని…

24 minutes ago

Scene on OTT: Can Suriya Escape Rajinikanth Treatment?

Suriya's film Scene directed by Jithu Madhavan was released in theatres on 6th November as…

26 minutes ago