
హైదరాబాద్, ముంబయి నగరాలకు గంజాయి, గుజరాత్‌కు ఎర్ర చందనం, ఆఫ్రికాకు రేషన్ బియ్యం.. అన్నీ ఏపీ నుంచే సరఫరా అవుతుండటం విశేషం. అయితే ఏపీలో ప్రభుత్వం మారి ఆరు నెలలవుతున్నా ఇవన్నీ అక్రమంగా రవాణా అవుతుండటం గమనిస్తే, వీటి వెనుకున్న ముఠాలు ఎంత శక్తివంతమైనవో అర్దమవుతుంది.
రెండు వారాల క్రితమే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా షిప్పుని పట్టుకున్నారు. కానీ ఇటీవలే మళ్ళీ కాకినాడ, వైజాగ్ పోర్టులలో బియ్యం కంటెయినర్స్ పట్టుబడ్డాయి. అంటే పవన్ కళ్యాణే కాదు.. ఎవరు వచ్చినా రేషన్ బియ్యం అక్రమ రవాణా ‘ఆపేదేలే’ అని తెగేసి చెప్పిన్నట్లే భావించవచ్చు.
తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ లేదా ఏపీలో గంజాయి పట్టుబడిన ప్రతీసారి ‘ఉక్కుపాదంతో అణచివేస్తామని శపదం చేశారుగా.. ఏమైంది మీ శపదం?’అంటూ వైసీపీ నేతలే ఏపీ హోం మంత్రి అనిత వంగలపూడిని నిలదీస్తున్నారు. వారి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాలి.
తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ‘పాటన్’లో 5 టన్నుల ఎర్ర చందనం పట్టుబడింది. ఈ విషయం ఏపీ పోలీసులు ముందే పసిగట్టి గుజరాత్ పోలీసుల సహకారంతో ఎర్రచందనం దుంగలని, స్మగ్లర్లను పట్టుకుని ఏపీకి తీసుకువస్తున్నారు.
“గత ప్రభుత్వ హయంలో ఎర్ర చందనం దొంగలకు రెడ్ కార్పెట్ వెల్కం చెప్పేవారని కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా కటినంగా వ్యవహరిస్తోందని, అందువల్లే గుజరాత్ వరకు మన పోలీసులు వెళ్ళి ఎర్రచందనం దుంగలని, స్మగ్లర్లను పట్టుకున్నారని” మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
నిజమే. కానీ నేటికీ విదేశాలకు ఎగుమతి చేసేందుకు రేషన్ బియ్యం పోర్టుకి వస్తూనే ఉంది కదా? హైదరాబాద్‌లో గంజాయి పట్టుబడుతూనే ఉంది కదా?ఇప్పుడు ఎర్రచందనం పట్టుబడింది కదా? అంటే ఈ మూడింటి అక్రమ రవాణా ఆగలేదని స్పష్టమవుతోంది కదా?ఇది ప్రభుత్వ నిస్సాహాయతా లేదా వాటిని అక్రమ రవాణా చేస్తున్నవారి శక్తి సామర్ధ్యాలకు నిదర్శనం అనుకోవాలా?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…