Telugu

అందరూ ఆయననే ఆడిపోసుకుంటారు కానీ…

అందరూ ఆయననే ఆడిపోసుకుంటారు పాపం! కానీ ఎవరికి తెలుసు.. ఈ దేశంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు, మీడియా వాటిలో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులకు ఆయనే చేతినిండా పని కల్పిస్తున్నారని?

ఆయన కేసులే లేకపోయుంటే ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు వాటిలో పనిచేసే వారందరి పరిస్థితి ఏమై ఉండేది?అని ఒక్కరైనా ఆలోచించారా? లేదే!

ADVERTISEMENT

ఆయన కేసులు, రాజకీయాలే లేకపోతే ఈ మీడియాకి రాసుకోవడానికి నాలుగు ముక్కలు దొరికేవా? లేదు కదా?ఇంతమందికి జీవితాంతం ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపడుతున్నాడనే కృతజ్ఞత వీసమంతైనా ఉందా?లేదే!

ఈ కేసులేవీ ఇప్పట్లో ముగిసేవి కావు. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయవాదులు, సీబీఐ, ఈడీ, ఏసీబీలలో అందరూ కలిసి కుట్ర చేసి ఈ కేసులు ముగించాలనుకున్నా వారి తరమా? కానే కాదు. కనుక ఈ కేసులతో ఇప్పటి ఉద్యోగులకే కాదు… వారి తర్వాత తరంవారికి కూడా ఆయన ఉపాధి హామీ ఇవ్వగలరు.

కేసులతో ఫుట్‌బాల్‌ ఎలా ఆడుకోవచ్చో కోర్టులు, లా కాలేజీలకు కూడా పాఠాలు చెప్పగలరాయన. ఆయన బెయిల్‌పై బయట ఉండి మాట్లాడుతుంటారు… న్యాయవాదులు కోర్టు లోపల మాట్లాడుతుంటారు. చిన్న తేడా అంతే!

అయినా ఒకే ఒక్క వ్యక్తి అదీ… కేవలం కేసులతోనే ఇంతమందికి ఇన్నేళ్ళపాటు ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన దాఖలాలు ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఉందా?అదీ… ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా?

కానీ ఈ చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ మంత్రి నారా లోకేష్‌ విమానాలు వేసుకొని విదేశాలు తిరిగేసి నాలుగు కంపెనీలు పట్టుకొచ్చి లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని గొప్పగా గొప్పలు చెప్పుకుంటారు. కానీ అయన ముందు వీరందరూ దిగదుడుపే కదా? కనుక ఎవరు ఏమనుకున్నా అయన గొప్పదనం తగ్గిపోదు.

అబ్బా… ఆయన ఆయన అంటూ అందరినీ కన్ఫ్యూజ్ చేసినట్లున్నాను. అబ్బా అయన పేరు నాలిక మీదే ఉంది కానీ గుర్తురావడం లేదు. బహుశః మీకు గుర్తు వచ్చే ఉంటుంది!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will Filmmakers Now Write With the Censor Board in Mind?

Getting a film to the release date is one thing. Getting it past the censor…

12 minutes ago

REJECTED! Ram Charan In No Mood to Repeat Past Blunders?

Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…

41 minutes ago