
ఈరోజు ఏపీ రాజకీయాలకు సంబంధించి మూడు ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. 1. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. 2.స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. 3. స్థానిక సంస్థల ఎన్నికలపై చాణక్య సర్వే నివేదిక.
1. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ పదేళ్లుగా సీబీఐ వద్ద చిక్కుకుపోయాయని, కనుక వాటిపై రోజువారి విచారణ జరిపించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ విచారణకు జగన్‌తో సహా నిందితులు అందరూ హాజరవ్వాలని ఆదేశించవలసిందిగా ఈడీ హైకోర్టుని కోరింది.
2. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. పంచాయతీ వార్డులు: 26.73%, సర్పంచ్: 27.95%, ఎంపీటీసీ: 25.55%, ఎంపీపీ / జెడ్పీటీసీ: 24.60%, జెడ్పీ చైర్‌పర్సన్లు: 23.08%, మున్సిపల్ వార్డులు: 32.78%, మున్సిపల్ చైర్‌పర్సన్లు: 33.02%, మేయర్లు: 35.29% సీట్లు బీసీలకు కేటాయిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
3. చట్టప్రకారం ఇంతకు మించి కేటాయించడం సాధ్యం కాదు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు 34 శాతం కంటే తక్కువ ఉన్నచోట పార్టీల పరంగా బీసీలకు సీట్లు కేటాయిస్తామని మంత్రి అచ్చన్నాయుడు చెప్పారు.
4. త్వరలో జరుగబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు చాణక్య స్ట్రాటజీస్ ‘మూడ్ ఆఫ్ ఏపీ’ పేరుతో ఓ సర్వే నిర్వహించి నివేదిక ప్రకటించింది. దాని ప్రకారం ప్రజలు కూటమికే మొగ్గు చూపబోతున్నారని తేల్చి చెప్పింది.
తాజా సర్వేలో టీడీపి:46.9%, జనసేన: 9%, బిజేపి: 3.5%, వైసీపీ:35%, ఇతరులు: 5.6% ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మంత్రులలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు ముగ్గురు పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో పేరొంది.
Andhra Pradesh is preparing for the upcoming local body election, which are barely a few…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, is all set to hit…