
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ జగన్ అరిగిపోయిన రికార్డులా పాట పాడుతూనే ఉన్నారు. మరోపక్క ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కో హామీని అమలు చేస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కూడా ఒకటి. ఆగస్ట్ 2 నుంచి ఈ పధకాన్ని అమలు చేయబోతున్నారు.
రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి కోసం ఉద్దేశించబడిన ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో 6.50 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం డబ్బు జమా చేయబోతోంది.
దీనిలో పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2,000, అన్నదాత సుఖీభవ’ పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 7000, కలిపి మొత్తం రూ. 7000 చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం జమా చేస్తుంది.
ఆగస్ట్ 2న మొదటి విడతలో రూ. 7000, రెండో విడతలో మరో రూ.7000, మూడో విడతలో రూ.6,000 కలిపి ఏడాదికి మూడు విడతలలో మొత్తం 20,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించబోతున్నాయి.
ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడమే ఆలస్యం. అంటే ఒక్క ఆగస్ట్ నెలలోనే సూపర్ సిక్స్‌లోని రెండు హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతోందన్న మాట! అయినా జగన్ అరిగిపోయిన రికార్డ్ వేయడం మానుకోవడం లేదు.
కనుక అమలుచేసిన హామీల జాబితా, వివరాల కాపీలు ఎప్పటికప్పుడు జగన్‌కి పంపిస్తే మంచిదేమో?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…