
ఉదయం 9 గంటలకే రాష్టంలోని 2 లక్షలమంది టీచర్లు బయోమెట్రిక్ వేయాలి ..ఆ తర్వాత మొబైల్ ఫోన్లలో విద్యార్థుల హాజరుతీసి పంపాలి. మళ్ళీ ఎండిఎం విద్యార్దులను లెక్కించి, ఐఐఎంఎస్ యాప్లోకి ఎక్కించాలి. తర్వాత 10:30 నుండి 10:45 మద్య విద్యార్థులకు అంబలి అందించాలి.
మరోపక్క మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. హెచ్ఎంగారో మరొకరో వెళ్ళి ప్రతీరోజు మరుగుదొడ్లకు ఫోటోలు దీసి పంపాలి. కోడిగ్రడ్లు, బియ్యం, పప్పులు ఉప్పులు, జగనన్న చిక్కీలు, గోరుముద్దలు, గ్యాస్ సిలిండర్స్ పద్దుల కధ వేరే ఉంటుంది. వీటన్నిటి మద్యలో పిల్లలకు పాఠాలు చెప్పాలి. వారి హోమ్ వర్క్ పుస్తకాలు దిద్దాలి. పరీక్షలు జరిగితే ప్రశ్నాపత్రాలు దిద్దాలి.
వీటిలో ఎక్కడ తేడా వచ్చినా ఉద్యోగాలలో నుంచి సస్పెండ్ చేస్తారేమో అనే ఆందోళన. ఇప్పుడు రాష్ట్రంలో టీచర్లు తమ మొబైల్ ఫోన్లలో వాట్సప్ మెసేజ్లు వస్తే ఉలిక్కి పడుతున్నారంటే వారు ఎటువంటి భయాందోళనలతో ఉద్యోగాలు చేస్తున్నారో అర్దం చేసుకోవచ్చు.
అయితే గతంలో పిల్లలకు, టీచర్లకు హాజరు లేదా?మధ్యాహ్నం భోజన పధకం లేదా?పరీక్షలు ఉండేవి కావా?ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండేదా?అంటే కాదనే అందరికీ తెలుసు. కానీ గత నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో చేస్తున్న ఈ ప్రయోగాలతో విద్యావ్యవస్థ మెరుగుపడకపోగా ఇంకా క్రుంగిపోతోంది.
నిజానికి ప్రభుత్వానికి తమపై నమ్మకం లేకనే సంస్కరణల పేరుతో ఈవిదంగా వేధిస్తోందని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ప్రభుత్వం తమని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తూ, భయాందోళనలతో ఉంచుతూ ఏమి సాధించాలనుకొంటోంది?అంటే తాము డీఏ బకాయిలు, పాత పింఛన్ విధానం, పిఆర్సీ, తమ జీపీఎఫ్ ఖాతాలలో ప్రభుత్వం తీసి వాడేసుకొన్న సొమ్ము మొదలైనవాటి గురించి అడగలేని పరిస్థితి కల్పించి నెలనెలా జీతాలు ఇస్తే అదే చాలనుకొనేలా చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర విద్యావ్యవస్థలో ఓ అనారోగ్యకరమైన వాతావరణాన్ని ప్రభుత్వమే సృష్టించి, దాంతో అంతర్జాతీయస్థాయి విద్యార్థులను తయారుచేయగలమని నమ్మబలుకుతోంది. కానీ ఈవిధానాలు ఇలాగే కొనసాగితే ఏదో ఓ రోజు విద్యావ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ…
Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…