తెలంగాణ-ఏపీ రాజకీయ పోటీ: ఎవరు దూసుకెళ్లిపోతారు?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను, ఆ రాజకీయాన్ని రసవత్తరంగా నడుపుతున్న ప్రభుత్వ పెద్దలను, ప్రతిపక్ష నేతలను చూస్తుంటే చిన్ననాటి తాబేలు, కుందేలు కథలు గుర్తుకొస్తున్నాయి.

ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవాన్ని వెనకేసుకొని తన మీద, తన కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని, తన కుటుంబ పరువుని మీడియాలోకి లాగి రచ్చ చేసిన వారిని సైతం చేతిలో అధికారం ఉండి కూడా ఉపేక్షిస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే తన పార్టీ మీద, తన ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, రాష్ట్ర వినాశాన్ని కాంక్షించిన వారిని, టీడీపీ పార్టీ అస్తిత్వాన్ని తుడిచిపెట్టాలని చూసిన వారి పట్ల కూడా తాబేలు మాదిరి మెల్లిగా ఒక్కో అడుగు ముందుకెళుతున్నారు.

ఇటువంటి వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్, రోజా, పేర్ని నాని..వంటి నేతలు మీద కూడా కేసులు పెట్టి జైళ్లకు పంపడానికి ఏపీ ప్రభుత్వం తాబేలు మాదిరి నత్త నడకనే ఎంచుకుంది.

అలాగే రాష్ట్ర పరువుని, ఏపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పై కూడా ఏపీ ప్రభుత్వం అంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతుంది.

ఇక రాజకీయ నాయకుడిగా తప్పా పాలనా పరంగా ఎటువంటి అనుభవం లేని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కుందేలు మాదిరి ఎటువంటి తడబాటు, ముందాలోచన లేకుండా చెంగు చెంగున నిర్ణయాలు తీసుకుంటున్నారు వాటిని అమలు చేస్తున్నారు.

ఇందులో రేవంత్ తీసుకున్న మొదటి నిర్ణయం హైడ్రా. హైడ్రా నిర్ణయాన్ని ప్రజలు కూడా వ్యతిరేకించిన రేవంత్ తగ్గేదెలా అన్నట్టుగా ముందడుగే వేశారు.

ఇందులో కూడా సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ఒకే న్యాయం అన్నట్టుగా అక్కినేని N కన్వెన్షన్ తో హైడ్రాకు భూమి పూజ చేసిన రేవంత్ మూసి ప్రక్షాలతో బ్రేక్ తీసుకున్నారు.

ఇక ఆ తరువాత కూడా రేవంత్ చాల వేగంగానే తన రాజకీయ అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి తెలంగాణ రాజకీయ రచ్చకు తెర లేపారు.

అయినా కూడా తానూ అనుకున్న విధానాన్నే ముందుకు తీసుకురాగలిగారు. ఇక లేటెస్ట్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా రేవంత్ సినిమా నటుల క్రెజ్ కి గాని సొంత పార్టీ కుటుంబం సభ్యులని కానీ వెనక్కి తగ్గలేదు.

ఇక అతి త్వరలో రేవంత్ మరో సంచలన నిర్ణయంతో 2025 కి స్వాగతం చెప్పబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు గొడుతున్నాయి.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు అంటూ ప్రచారమవుతున్న వార్త ఇక తెలంగాణ రాజకీయాలను ఏమార్పూ దిశగా అడుగులు వేయిస్తుందో చూడాలి.

ఈ తంతు కూడా పూర్తి చేసి రేవంత్ బిఆర్ఎస్ తో, కేసీఆర్ కుటుంబంతో తనకున్న పాత బాకీలను సరిచేసుకుంటారా.? అనే చర్చ జరుగుతుంది.

మరి రేవంత్ ప్రభుత్వం లోకి వచ్చిన ఏడాది లోపే ఇంత వేగంగా తన రాజకీయ లెక్కలు సరిచేసుకుంటూ, తన మార్క్ పాలన చూపించడానికి కుందేలు మాదిరి చెకచెకా అడుగులు వేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి బాబు మాత్రం తనను, తన కుమారుడిని అవమానిస్తూ సినిమాలు తీసిన ఆర్జీవీ పట్ల కూడా తాబేలు మాదిరి నత్తనడక ధోరణినే అవలంభిస్తు పార్టీ క్యాడర్ ను కూడా సంతృప్తి పరచలేకపోతున్నారు.

అలాగే ఇటు వివేకా అహత్య కేసులో కూడా వేగం పెంచి కడప వైసీపీ ఎంపీ అవినాష్ తో పాటు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వంటి వారికీ కూడా చెక్ పెట్టె అవకాశం ఉన్నప్పటికీ బాబు మాత్రమే తొందరపడటం లేదు.

మరి ఈ రాజకీయ రేసులో తాబేలు నమ్మదత్వం నెగ్గుతుందా.? లేక కుందేలు వేగం ఫలితాన్ని అందిపుచ్చుకుంటుందా అనేది మరో ఐదేళ్ల తరువాతనే తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

42 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

51 minutes ago