Telugu

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై మెట్రోలోని రెండో దశలో భాగంగా రూ.4,900 కోట్లు వ్యయంతో నిర్మించిన పూందవల్లి-వడపళని కారిడార్‌లో మెట్రో సర్వీసులను ఇరువురూ కలిసి ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి వారిరువురూ మెట్రోలో ప్రయాణించారు.

సిఎం విజయ్‌ ప్రధాని మోడీ పర్యటనలో చివరి వరకు పక్కనే ఉన్నారు. తద్వారా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రోటోకాల్ పాటించారు. ప్రధాని పట్ల కనీస గౌరవం చూపారు.

ADVERTISEMENT

కానీ రాష్ట్రంలో అన్నివేల కోట్ల రూపాయల విలువగల అభివృద్ది పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుంటే, అయన పక్కనే ఉన్న సిఎం విజయ్‌ మొహంలో చిర్నవ్వు కనిపించలేదు.

ప్రధాని మోడీతో తిరిగేందుకు, ఆయనతో ఫోటోలు, వీడియోలు దిగేందుకు ఇష్టం లేదన్నట్లు చాలా ముభావంగా వ్యవహరించారు.

అయితే అయన ఈవిధంగా మొహం మాడ్చుకొని తిరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు ఒకసారి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ ఇలాగే వ్యవహరించారు. కనుక నేడు మొహం మాడ్చుకొని వెంట తిరగడం అయిష్టం వల్లనే అని అనుమానించాల్సి ఉంటుంది.

సిఎం విజయ్‌ ముభావంగా మొహం ముడుచుకోవడానికి అయన కారణాలు ఆయనకు ఉండవచ్చు. కానీ మీడియా కవరేజ్ చేస్తునప్పుడు కూడా ఆయన అలా మొహం ముడుచుకుని ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎన్డీయేలో టీడీపి భాగస్వామిగా ఉన్నప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి శ్రమిస్తూనే ఉంటారు. అయినా అరకొర నిధులు విడుదలవుతుంటాయి.

కానీ టీవీకే పార్టీ ఎన్డీయేలో లేదు. అయినా తమిళనాడు రాష్ట్రానికి ఏకంగా రూ. 17,900 కోట్లు విలువగల అభివృద్ధి పనులు మంజూరు చేశారు. ఒకవేళ మంజూరు చేయకపోతే అప్పుడు సిఎం విజయ్‌ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవారు.

బిజేపిని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తే లేదా అయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసినప్పుడు చిర్నవ్వుతోనే అభ్యర్ధిస్తుంటారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించుకుంటున్నారు.

తమిళనాడు ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ప్రమాణ స్వీకారం రోజునే చెప్పేశారు. అయినా ఎడాపెడా సంక్షేమ పధకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. వాటి కోసం నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు చాలా అవసరమని సిఎం విజయ్‌కు తెలిసే ఉంటుంది.

కానీ సొంతంగా మెజార్టీ కూడా లేని ప్రభుత్వం నడుపుతున్న సిఎం విజయ్‌ ప్రధాని మోడీ వస్తే మొహం మాడ్చుకొని వెంట తిరుగుతున్నారు! ఆయన రాకను ఓ అవకాశంగా భావించే బదులు, అయన రాష్ట్రానికి రాకుండా ఉంటే బాగుండునన్నట్లు సిఎం విజయ్‌ వ్యవహరిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. ఎలాగూ సినిమాలలో నటించిన అనుభవం ఉంది కనుక ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా కాస్త నవ్వు మొహం పెట్టుకొని నటించొచ్చు కదా? సర్లే! మొహం చాటేసే కేసీఆర్‌ కంటే మొహం మాడ్చుకుని ప్రధాని వెంట తిరిగే సిఎం విజయ్‌ నయమని సరిపెట్టుకుందాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CJP Protests: Is Abhijeet Dipke Justified in Insulting PM Modi?

The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…

31 minutes ago

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

1 hour ago