
అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులపై ఎన్నో ఆరోపణలు చేయడం, కేసులు నమోదు చేస్తుండటం, కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపుతుండటం ఈరోజుల్లో చాలా సాధారణ విషయమైపోయింది.
మనం ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుంది. అవే ఫలాలు లభిస్తాయని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. ఆయన వేరే ఉద్దేశ్యంతో చెప్పినప్పటికీ ఆయన వేసిన విత్తనమే ఇప్పుడు మాహా వృక్షంగా మారి కేసులు, అరెస్టులు, జైలు ఫలాలు అందిస్తోందని అందరికీ తెలుసు.
నాడు కేసీఆర్ తెలంగాణలో టిడిపీని తుడిచి పెట్టేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించారు.
ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి టీడీపీని తుడిచి పెట్టేయాలని జగన్ అనుకున్నారు. కానీ ఇద్దరి ప్రయత్నాలు బెడిసి కొట్టడమే కాకుండా ఇద్దరూ టీడీపీ వలననే పదవీ, అధికారం కోల్పోయారు.
అయితే కేసీఆర్, జగన్ తొందరపడినట్లుగా ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తొందర పడటం లేదు. వారిపై రాజకీయకక్ష సాధించడానికి ప్రయత్నిస్తే ప్రజల సానుభూతి వారికే లభిస్తుందని ఇద్దరికీ తెలుసు. అందుకే అరెస్టు చేసేందుకు తొందరపడటం లేదు.
వారిని రాజకీయంగా వేధించడం కంటే వారి అవినీతి పనులను, అక్రమాలను వెలికి తీయించి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టినట్లయితే, ప్రజలే నిర్ణయించుకుంటారని సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమీషన్ తయారుచేసి ఇచ్చిన నివేదిక సిఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉందిప్పుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. ఎఫ్-1 రేసింగ్ కేసు విచారణ ఎప్పుడో ముగిసింది. ఇక్కడ ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది.
ఆ తర్వాత వారు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం ఖాయమే. కానీ వారు అవినీతికి పాల్పడ్డారని ప్రజలకు నమ్మకం కలిగించగలిగితే చాలు. అదే వారి పార్టీల పాలిట శాపంగా మారవచ్చు.
ఈ కేసుల నుంచి బయట పడేందుకు కేసీఆర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటే కుదరలేదు. బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకోవడం ద్వారా, అధికారంలో భాగస్వాములుగా చేసుకోవడం వలన జగన్ బీజేపీతో చేతులు కలపలేని పరిస్థితిని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కల్పించారు.
అక్కడ ఆ కేసులు, ఇక్కడ ఈ కేసులు ఒకేసారి కొలిక్కి వస్తున్నట్లే ఉన్నాయి. కనుక అక్కడ కేసీఆర్ & కో, ఇక్కడ జగన్ & కో పరిస్థితి, భవిష్యత్ ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్నాయిప్పుడు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…