
నీళ్ల కోసం యుద్ధాలే జరిగాయి అంటూ అప్పుడెప్పుడో పుస్తకాలలో చదివిన రోజుల నుంచి ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే స్థాయికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదిగిపోయారు. అయితే ఈ ఎదుగుదలకు మాత్రం ముఖ్య కారణం బిఆర్ఎస్ పార్టీ అనే చెప్పాలి. మరి ఈ ఎదుగుదల మరింత దిగజారడానికి ప్రతీకా.? కాదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఏపీ – తెలంగాణ మధ్య కొనసాగుతున్న నీటి ప్రోజెక్టుల చర్చ ఇరు రాష్ట్ర రాజకీయాలలో నిప్పులు పారిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే నీటిని ఏపీ తనకు అనుకూలంగా వినియోగించుకోవడానికి తెలంగాణ పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి.
ఇది ఖచ్చితంగా తెలంగాణ నీటి హక్కులను హరించడమే, ఇటువంటి చర్య తెలంగాణ ద్రోహం అంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ ద్రోహానికి నువ్వు కారణం అంటే నువ్వు అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ఒకరి మీద ఒకరు నీళ్ళ నిందలు మోపుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే., తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి వృధాగా సముద్రంలో కలిసే నీటిని ప్రోజెక్టుల రూపంలో భద్రపరిస్తే తప్పేంటి.? తెలంగాణ రాష్ట్రానికొచ్చే నష్టమేంటి.? అనేది ఏపీ ప్రభుత్వ వాదన. ఇలా ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు నిప్పులు పారిస్తున్నాయి.
అయితే ఏపీలో నిర్మించబోతున్న ఈ నీటి ప్రోజెక్టుల పైన తెలంగాణలో అధికార – ప్రతిపక్షాలది ఒక్కటే మాట, అది ఏపీ, తెలంగాణ నీటి హక్కులను హరిస్తుంది, ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తుందని. కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య వారిలో వారికీ ఎన్ని విభేదాలున్నప్పటికీ ఏపీ విషయానికొస్తే ఇద్దరు ఒకదారిలోనే ప్రయాణిస్తున్నారు.
కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం తెలంగాణ వాదనను తప్పుబడుతూ ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైసీపీ మాత్రం కనీసం గొంతు విప్పకుండా తన రప్ప రప్ప రాజకీయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతుంది.
కృష్ణా జలాల వాటా కోసం, గోదావరి మిగులు నీటి వినియోగం కోసం ఇరు రాష్ట్రాల మధ్య ఆయా ప్రభుత్వాల మధ్య రాచుకున్న ఈ నీటి చిచ్చు చిలికి చిలికి కోర్టుల వరకు వెళ్లాయి. నేడు ఏపీలో నిర్మించబోతున్న మల్లన్న సాగర్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
పోలవరం, నల్లమల సాగర్ ప్రోజెక్టుల పై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదనలో ఏపీ తరుపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి, జగదేవ్ గుప్తా రాష్ట్ర భూభాగంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తరలించడం పై పొరుగు రాష్ట్రాలకు అభ్యంతరం ఏమిటి.? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ళ అనుమతి అవసరమా అంటూ ప్రశ్నను లేవనెత్తారు.
ఏపీ ముఖ్యమంత్రి బాబు నదుల అనుసంధానం అంటూ భవిష్యత్ నీటి అవసరాల కోసం ఇప్పుడే ప్రణాళికలు రూపిందించి అమలుపరుస్తుంటే తెలంగాణ నాయకులు మాత్రం ఇప్పటికి ఆ ప్రాంతీయవాదం అనే చిన్న గీత దగ్గరే ఆగిపోయి అటు తెలంగాణకు ఇటు ఏపీకి ఎటువంటి ప్రయోజనాలు లేని నీటి రాజకీయం చేస్తూ ఒకరిమీద మరొకరు బురద జల్లుకుంటున్నారు.
Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…
Senior actress Indraja has openly slammed the trend of holding success meets for films that…