
తెలంగాణ మీదుగానే కృష్ణా, గోదావరి ప్రవహించి ఆంధ్రాకు చేరుకుంటాయి. అయితే వాటి కోసం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆవేశంగా రంకెలు వేస్తోంది.
“ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కి తరలించుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి ఆయన చంచా. కనుక గురు దక్షిణగా నీటిని దిగువకు విడిచిపెట్టేస్తున్నారంటూ” కేటీఆర్ రంకెలు వేస్తున్నారు.
తెలంగాణ మీదుగా ఏపీకి చేరుతున్న నీరు సముద్రంలో కలిసినా పర్వాలేదు కానీ ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ అవసరాలకు వాడుకో రాదనడం వితండవాదమే కదా?
ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం వలన తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు ఏవిధంగా నష్టం జరుగుతుందో ఈ నీటి మేధావులు చెప్పరు.
ఎందుకంటే, ఏపీకి చేరిన నీటిని వాడుకోవడం తప్పేలా అవుతుందని తెలంగాణ ప్రజలే ప్రశ్నించవచ్చు. ఎగువన ఉన్న మనం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటే తప్పు కానప్పుడు దిగువనున్న ఏపీలో ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పేలా అవుతుందని ప్రశ్నించవచ్చు.
నాగార్జున సాగర్ కాలువ నుంచి తెలంగాణకు నీళ్ళు తరలించుకుంటునప్పుడు, కాలువ నుంచి ఆంధ్రాకు తరలించుకోవడం తప్పేలా అవుతుందని తెలంగాణ ప్రజలే ప్రశ్నించవచ్చు.
కనుక ‘ఆంధ్రా నీళ్ళ దోపిడీకి రేవంత్ రెడ్డి సహకారం’ అంటూ బీఆర్ఎస్ నేతలు బిగ్గరగా వాదిస్తుంటారు. ఇది తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టించడం లేదా వారిని అభద్రతభావానికి గురిచేస్తూ, వారిలో ప్రభుత్వం పట్ల ఆనుమనాలు, అపోహలు సృష్టించడం కోసం కావచ్చు. తద్వారా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారి అంచనా కావచ్చు.
ఈ నీళ్ళ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కనుక మేల్కొవాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తప్ప ఆంధ్రా ప్రభుత్వం కాదు.
కానీ సిఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు రెండు రోజులుగా ఢిల్లీలో మ,అకాం వేసి మంత్రి పదవుల పంచాయితీలో బిజీగా బిజీగా ఉన్నారు.
అది తేలే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలను ఖండించడానికి ఎవరికీ తీరిక ఉండదు. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ చక్కగా వినియోగించుకుంటోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల దగా పాలన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. తెలంగాణ వస్తే చాలు మంత్రం దండం తిప్పి మాయం చేసినట్లు అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయని నమ్మించిన బీఆర్ఎస్ పార్టీ నేతలే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సర్వనాశనం అయిపోతోందంటూ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో పరిస్థితి ఈవిధంగా ఉంటే, ఇక్కడ ఆంధ్రాలో పండగ వాతావరణం నెలకొంది. మొన్న వెలిగొండ ద్వారా కృష్ణా నీటిని విడుదల చేయగా, నేడు పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి నీటిని విడుదల చేశారు. కనుక అటు నెల్లూరు నుంచి ఇటు అనకాపల్లి వరకు గలగలా నీళ్ళు పారుతుంటే, ఆయా జిల్లాల ప్రజలు తండోపతండాలుగా ఆ కాలువల వద్దకు వచ్చి జల హారతులు ఇస్తున్నారు.
ముఖ్యంగా రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. ఆ నీళ్ళ కాలువల వద్ద నెలకొన్న సందడి చూస్తే అక్కడేదో పండగ తిరునాళ్ళు జరుగుతున్నట్లే ఉంది. సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలలో పరిస్థితి ఇలా తారుమారు అవుతుందని ఎవరైనా అనుకున్నారా?
Dulquer Salmaan is currently promoting his upcoming film I’m Game, which is also releasing in…
The success of Hanuman Ansh has once again shown the growing pull of devotional cinema.…