
ఇంతకాలం రాజభోగాలు అనుభవించి ఎన్నికలలో ఓడిపోయిన వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ఏమిటా? అని మదనపడుతుంటే, వారి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు తలొగ్గి రాజీనామాలు చేసిన 1.08 లక్షల వాలంటీర్లు రోడ్డున పడ్డామని ఆందోళన చెందుతూ వారి చుట్టూ తిరుగుతున్నారు.
అయితే నాడు వాలంటీర్లను బెదిరించి, ప్రలోభపెట్టి రాజీనామాలు చేయించిన వైసీపి నేతలు ఇప్పుడు వారికి మొహం చాటేస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు మీ వల్లనే మేము ఓడిపోయామని తిట్టి పంపిస్తున్నారు.
దీంతో పలు జిల్లాలలో వాలంటీర్లు టిడిపి, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి మళ్ళీ తమని ఉద్యోగాలలోకి తీసుకోవాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. వేడుకుంటున్నారు.
తమకు ఈ బొటాబోటి జీతాలు కూడా లేకపోతే రోడ్డున పడతామని అందుకే వాలంటీర్లుగా వైసీపి నేతలు చెప్పిన ప్రతీ పనీ చేయక తప్పలేదని, కానీ నామ మాత్రపు జీతం ఇస్తూ తమని 5 ఏళ్ళు వాడుకొని, పోతూ పోతూ తమని రోడ్డున పడేసి వెళ్లిపోయారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదనే ఈసీ ఆంక్ష విధించినందున వైసీపి నేతలు వారిచేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే, చంద్రబాబు నాయుడు వారిని వారించారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని, తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి జీతాలు నెలకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు హామీని నమ్మిన సుమారు 50 వేలమంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేయకుండా ఉండిపోగా వైసీపి నేతలని నమ్ముకున్నవారు రోడ్డున పడ్డారు.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో తనని నమ్ముకున్న వైసీపి నేతలను, కార్యకర్తలని ఇలాగే నడిరోడ్డున వదిలేసి వచ్చేశారు.
తల్లిని, చెల్లిని వైసీపి కోసం వాడుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వారినీ బయటకు గెంటేశారు.
రెండేళ్ళ తర్వాత సగం మంది మంత్రులు అసమర్ధులంటూ బయటకు గెంటేశారు. ఎన్నికలకు ముందు తననే నమ్ముకున్న సుమారు 70 మంది వైసీపి ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఇలాగే రోడ్డున పడేశారు. చివరికి ఇప్పుడు వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…
బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు…