
‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించినా రాని గుర్తింపును ఈ సినిమాలో పోషించిన ‘రైల్వే రాజు’ పాత్ర ద్వారా తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమా మంచి విజయం సాధించడం పట్ల ఆనందంగా ఉందని, ఈ కథను మూడు నెలల్లో రాసేశామని, కానీ స్క్రిప్టుగా మలిచేందుకు మూడేళ్లు పట్టిందని, ఈ స్క్రిప్టు పట్టుకుని దర్శకుడు సాగర్ తో కలిసి ఫిల్మ్ నగర్, మణికొండలోని సినీ నిర్మాణ సంస్థల ఆఫీసుల వెంటపడ్డామని, ఎవరూ అవకాశం ఇవ్వలేదని సింపుల్ గా చెప్పాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితుడు నారా రోహిత్ చిరాకుపడ్డాడని, ‘ఇంకా ఈ తిరుగుళ్లు ఆపండి’ అని చెప్పి, సొంతంగా సినిమా నిర్మిద్దామని చెప్పాడని, ఆ మాటలే తనకు అండగా నిలిచాయని శ్రీ విష్ణు గుర్తుచేసుకున్నాడు. రోహిత్ కు తన జడ్జిమెంట్ పట్ల ఎంతో నమ్మకమని, అంతగా నమ్మిన రోహిత్ కు మంచి విజయం రావడం ఆనందంగా ఉందని శ్రీ విష్ణు చెప్పాడు.
BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…
For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…