
త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటాది. అయితే అది కూడా ఈ సినిమాకి ఉపయోగపడినట్టు కనిపించలేదు. మాస్ సినిమా కావడం ఈ చిత్రానికి ప్రతికూలాంశం అయ్యిందని నిపుణుల అభిప్రాయం. అయితే సంక్రాంతికి టీవీలో ప్రసారమైన సినిమాలలో మాత్రం అరవింద సమేతనే ఎక్కువ రేటింగ్లు రాబట్టింది. రామ్ అనుపమ పరమేశ్వరన్ నటించిన హలో గురు ప్రేమ కోసమే సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యి 8.7 రేటింగ్ సాధించింది.
జెమినీ టీవీలో సంక్రాంతికి మూడు సినిమాలు ప్రసారం అయ్యాయి. వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాకు 6.2 రేటింగ్, విశాల్ పందెం కోడి సినిమాకు 5 రేటింగ్, రవి తేజ – ఇలియానాల అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాకు కేవలం 3.4 రేటింగ్ మాత్రమే రావడం గమనార్హం. మొత్తానికి ఈ సంక్రాంతికి ఏ టీవీ ఛానల్ కూడా ఆనందంగా లేదనే చెప్పుకోవచ్చు. కోట్లు గుమ్మరించి కొంటున్న సినిమా హక్కులు అసలు సమయం వచ్చేటప్పటికి నిరాశపర్చడం వారికి మింగుడు పడటం లేదు.
The TDP-led alliance is highlighting its development record in Hindupur, represented by actor and MLA…
Vijay Deverakonda and Rashmika Mandanna have been facing extreme backlash on social media following their…