
ఉచితాలకు ‘చిత్తం మహా ప్రభో’ అంటూ రాజకీయ పార్టీలన్నీ దాసోహమవుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఉచితాలకు పట్టం కట్టాల్సిందే అనేంతలా పరిస్థితులు మారిపోయాయి అని ఒప్పుకోక తప్పదు.
ఉచిత పథకాలకు పూర్వము దేశ జనాభాలో పేదవారు, మధ్యతరగతి ప్రజల నిష్పత్తి ఇంచుమించు ఒకే స్థాయిలో ఉండేది. కానీ ఈ ఉచితాల పరిచయంతో పేదల సంఖ్యలో తగ్గాల్సిన మార్పు నిష్పత్తి మధ్యతరగతి వర్గంలో మొదలయ్యింది. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టె ఉచిత పతకాల భారం పన్నుల రూపంలో మోసేది మధ్యతరగతి వాడే.
దీనితో ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ వర్గం వారి ఆదాయంలో ఎటువంటి మార్పు కనపడదు కానీ వ్యయంలో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. పెరుగుతున్న ఖర్చులకు వస్తున్న ఆదాయానికి లెక్క సరిపోక అప్పులపాలవుతున్నారు మధ్యతరగతి ప్రజలు. వీరు ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు అనర్హులు కానీ ఆ పథకాల అమలు కోసం ప్రభుత్వాలు పెంచే పన్నుల భారానికి అర్హులుగా మిగులుతారు.
ఒక్క కుటుంబ ఆర్థిక వ్యవస్థనే కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా కుదేలు చేస్తున్నాయి రాజకీయ పార్టీల ఉచిత హామీలు. నిజంగా ఉచితాలను చూసే ప్రజలు ఓటేస్తున్నారు అనుకుంటే అప్పులు చేసి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరి అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికి పెద్ద పీట వేసిన వైసీపీ ఎందుకు ఓడింది? ప్రజలకు కావాల్సింది కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు మాత్రమే కాదనేది స్పష్టమయింది.
కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అనే సామెత మాదిరి ఉచితాలు ఇచ్చుకుంటే పొతే ఎంత ధనిక దేశమైన అప్పులపాలవ్వడం ఖాయమనేది నిరూపించడానికి ఎన్నో దేశాలు చరిత్రలో సాక్షులుగా నిలబడ్డాయి. పేదలకు సంక్షేమం అందించడం తప్పుకాదు కానీ సంక్షేమం పేరుతో పేదరికారాన్ని పెంచడమే రాజకీయ పార్టీలు చేస్తున్న నేరాలు.
ఒకరు అన్నం పెడతానంటే మరొకరు బిర్యానీ పెడతానంటూ, ఒకరు ఇళ్ల స్థలాలిస్తానంటే మరొకరు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని ఇలా తమ పార్టీ గెలుపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలతో తలరాత మారిన లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కానీ ఆ పథకాల అమలు కోసం పెంచిన పన్నుల భారంతో కుదేలవుతున్న కుటుంబాలు లెక్క చూసే ప్రభుత్వాలెన్ని?
ఈ ఉచిత పథకాల అమలు కోసం తలకు మించిన భారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీలు ఆ అప్పులకు భాద్యులు కారా? ఉచితాలు సముచితంగా ఉన్నంత వరకే సమాజం అభివృద్ధి బాట పడుతుంది. లేదంటే నాయకులు జగన్ మాదిరి నాయకులు
500 వందల కోట్ల ప్యాలస్ లో ఉంటే పేదవాడు సెంటు భూమి కోసం అరువులు చాచాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఉచితాలు కాదు ఉపాధి కల్పించాలి, పంపకాలు కాదు అభివృద్ధి చూపించాలి.
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…