
మహిళా భద్రతా కోసం నేటికీ ప్రభుత్వాల నుండి ఎన్నో కొత్త కొత్త చట్టాలు పుట్టగొడుగుల మాదిరి పుట్టుకొస్తూనే ఉన్నాయి. నాటి నిర్భయ చట్టం నుంచి నేటి దిశా చట్టం వరకు ప్రభుత్వాలు తమ విధిగా చట్టాలను రూపందించగలుగుతున్నారు.
అయినా ఈ సమాజంలో మహిళకు భద్రతా ఉందా అంటే దానికి సమాధానం నిత్యం వార్త పత్రికలలో మహిళల మీద జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
అయితే ఈ దారుణాలకు బలవుతున్న మహిళలు చాల వరకు వయస్సు తో సంబంధం లేకుండా బాధితులుగా మారుతున్నారు. అలాగే బాధితులే కాదు నిందితులు సైతం మైనర్ల గా ఉండడం ఇక్కడ సమాజం లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతుంది.
నాడు ఢిల్లీ నిర్భయ ఘోరం వెనుక, నేడు సికింద్రాబాద్ బాలిక అఘాయిత్యం నడుమ ఇందులో నిందితులు మైనర్లు కావడం సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఈ చిన్న వయస్సులోనే వీరి ఆలోచన ఈ విధంగా ఉంది అంటే, ఇంత అరాచకానికి వారు కారకులుగా మారారు అంటే ఇటువంటి వారు నేటి సమాజానికి ఎంత ప్రమాదకరమో, మహిళల భద్రతకు ఎంత హానికరమో ఊహించడానికి కూడా భయానకంగా ఉంది.
చెయ్యకూడని తప్పులు చేసి, ఒక మహిళ ఆత్మ గౌరవాన్ని కూని చేసి మేము మైనర్లము అంటూ నేరం నుంచి తప్పించుకోవాలనుకోవడం వారి హక్కునుకోవాలా.? అలాగే వారికి ఆ పాపంలో సరైన కఠిన శిక్ష వేయకపోవడం న్యాయవ్యవస్థ నిస్సహాయత అనుకోవాలా.?
ప్రభుత్వాలు చట్టాలు చేయడంలో చూపిస్తున్న ఉత్సుకత ఆ చట్టాలను బలంగా అమలు చేయడంలో చూపించలేకపోతున్నాయా.? న్యాయవ్యస్థలు కూడా నిందితులకు వారి హక్కులను కల్పించడం మీద పెట్టె దృష్టిని బాధితుల ఆవేదన తీర్చడం మీద పెట్టలేకపోతుందా.?
ఇలా నిత్యం ఎదో ఒక మూల ఎవరో ఒక మహిళ ఇటువంటి కామాంధుల వాంఛలకు బలికావాల్సిందేనా.? ఇటువంటి నేరస్తుల పై ఇటు ప్రభుత్వాలు అటు న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించిన నాడే అటువంటి వారి దురాగతాలకు అడ్డుకట్ట పడుతుంది. లేకుండా ఇలాంటి నిర్భయ, దిశ చట్టాలు ఎన్ని వచ్చినా మహిళా భద్రతా గాల్లో పెట్టిన దీపమే అవుతుంది.
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…