
Arnab Cyclone Crop Damage in Andhra Pradesh
నిన్నటి వరకు ఎలినో భయపెడితే ఈరోజు అర్నాబ్ హడలెత్తించింది. సాగు నీరు లేక, వరద నీరు వచ్చి ఇలా రైతు కష్టం ప్రతిసారి ప్రకృతి ప్రకోపానికి బలికావల్సిందేనా.? దేశానికి వెన్నుముకగా నిలిచే రైతు తన కుటుంబానికి చేయూత నివ్వలేకపోతున్నారా.?
సకాలంలో వర్షాలు రాకపోయినా, అకాల వర్షాలు వచ్చినా నష్టపోయేది రైతే. దేశంలో నానాటికి తినేవారు పెరుగుతున్నారు, పండించేవారు తగ్గుతున్నారు. ఇలా వంటకు – పంటకు మధ్య పెరిగిన డిమాండ్ సప్లై ధరల పెరుగుదలలో ప్రధాన భూమిక పోషిస్తుంది.
ప్రకృతిలో సంభవించే మార్పులకు తోడు నాణ్యత లేని ఎరువులు, విత్తనాలు కూడా రైతన్నలను ఆర్థికంగా కుంగతీస్తున్నాయి. అప్పులు చేసి, బంగారం తాకట్లు పెట్టి మరి పంట పండించే రైతు ఇలా నిత్యం ఎదో ఒక కారణంతో పంట నష్టాలను ఎదుర్కొంటే ఇంకా రైతు మనుగడకు ఆస్కారం ఉంటుందా.?
చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, పెట్టిన పెట్టుబడి చేతికి అందక, చేతికొచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇలా కారణం ఏదైనా ఆర్థికంగా నష్టపోతోంది మాత్రం రైతే. రైతు కష్టానికి తమ వంతుగా ప్రభుత్వాలు కూడా రైతు బందు వంటి పథకాలతో ముందుకు వస్తున్నా రైతు ఇంకా అప్పుల గుండం నుంచి బయటకు రాలేకపోతున్నారు.
రైతు ‘ఆత్మహత్య’ అంటూ గత దశబ్దాలుగా మీడియాలో, వార్తాపత్రికలలో వస్తున్న వార్తలు ఇప్పటికి అలానే కొనసాగుతున్నాయి అంటే రైతు పరిస్థితి ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉందో అర్ధమవుతుంది. అలాని రైతు పొలం దున్నకుండా ఉండలగడా.? పంట పండించకుండా ఆగగలడా.?
మొన్న కాకపోతే నిన్న, నిన్న కాకపోతే నేడు, నేడు కాకపోతే రేపు అనే ఆశ రైతును పొలంలోకి లాగుతుంది, పంట పండించేలా చేస్తుంది. గతంలో ఎప్పుడో ఒకసారి తలెత్తే ప్రకృతి విపత్తులు ఇప్పుడు రైతు ని నిత్యం నీడలా వెంటాడుతున్నాయి.
చేతి దాకా వచ్చింది నోటికి అందకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఎలినో దెబ్బకి ఆర్థికంగా నష్టపోయిన రైతు ఇప్పుడు అర్నాబ్ విధ్వంశం తో పీకలలోతు కష్టాలలో మునిగిపోయారు. అర్నాబ్ వర్ష బీభత్సానికి వరి, అరటి, బొప్పాయి, కొబ్బరి వంటి అనేక పంటలు నాశనమయ్యాయి.
అర్నాబ్ తుఫాన్ ప్రభావం పై సమీక్ష జరిపించిన సీఎం చంద్రబాబు సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు, 10,450 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్టు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎలినో తో కరువు అనుకుంటే అర్నాబ్ తో అతివృష్టి అయినట్టుంది అంటూ బోరుమంటున్నారు రైతన్నలు. ఎలా అయినా తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నం పెట్టె రైతు అర్దిస్తున్నాడు.
Cyclone Arnab has caused widespread damage across coastal Andhra Pradesh, bringing extremely heavy rainfall, strong…
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…