
దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి, మరో రెండు, మూడు రోజుల్లో కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ శుక్రవారం లోపున కోర్టుకు రావాలని చేసిన ఆదేశాలను కూడా జై బేఖాతరు చేయడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. జై అజ్ఞాతంలో ఉన్నట్లుగా పోలీసులు కోర్టుకు తెలుపగా, ఈ కేసును 10వ తేదీకి వాయిదా వేస్తూ, జై ను అరెస్ట్ చేసి మరో రెండు రోజుల్లో కోర్టులో ప్రవేశపెట్టాలని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళ హీరోగా రంగప్రవేశం చేసిన జై, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ‘జర్నీ’ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జై, ఆ తర్వాత ‘రాజా రాణీ’ సినిమాతోనూ అలరించాడు. అలాగే టాలీవుడ్ బ్యూటీ అంజలితో ప్రేమాయణం సాగిస్తున్నాడని గత కొంతకాలంగా వస్తున్న వార్తలూ బహిరంగమే. అంజలితో నటించిన “బెలూన్” సినిమా తెలుగు ఫస్ట్ లుక్ రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…