
ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా సాగేవి కానీ ఇప్పుడు రాజకీయాలంటే ప్రజలు సైతం ఏవగించుకునే పరిస్థితి. రాజకీయ నాయకులు బహిరంగ సభలు, ప్రెస్ మీట్స్, సోషల్ మీడియాలో తమ ప్రత్యర్ధులను బూతులు తిట్టడం లేదా అనుచితంగా మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది.
ఆంధ్రాలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చాలా సంయమనం పాటిస్తూ, తమ తమ నేతలని, కార్యకర్తలని కూడ కట్టడి చేస్తున్నారు. అయినా అడపాదడపా ఎవరో ఒకరు నోరు జారుతూనే ఉన్నారు. వారిని పద్దతి మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూనే ఉన్నారు.
టీడీపీ, జనసేనలు సమాయమనం పాటిస్తుంటే అది వైసీపీ అధినేత జగన్‌కి, ఆ పార్టీ నేతలకు చాతకానితనంగా కనిపిస్తోంది. కనుకనే ఇంకా రెచ్చిపోతున్నారు.
ఎన్నికలలో ఓడిపోయినప్పుడు వైసీపీ నేతలలో కనపడిన భయాందోళనలు ఇప్పుడు లేకపోవడానికి కారణం కూటమి ప్రభుత్వం మెతకదనమేనని శ్రేయోభిలాషులు మెటికలు విరుస్తున్నారు.
ఏపీలో మాత్రమే కాదు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ రాజకీయ అవలక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణంగా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవితని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలున్నాయి.
“తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తుంటే ఈ కల్వకుంట్ల కవిత ఒంటికి రంగులు పూసుకొని డాన్సులు ఎందుకు చేస్తోంది? ఆమె మాకు ఈ రిజర్వేషన్స్ ఇప్పించారా? లేదా ఆమె ఏమైనా బీసీనా? అసలు మాతో ఆమెకు ఏం సంబంధం? మాతో కంచం సంబంధముందా మంచం సంబంధముందా?” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కుల గణన, బీసీ రిజర్వేషన్స్ అంశంపై సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంతో పార్టీ నుంచి స్పస్పెండ్ కాగా కల్వకుంట్ల కవిత పరిస్థితి అందరికీ తెలిసిందే.
ఆమె నేటికీ తండ్రి భజన చేస్తున్నప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ ఆమె దారిదాపులకి కూడా వెళ్ళడం లేదు. కనుక ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో లేదో ఆమెకే తెలీని పరిస్థితి.
ఇటువంటి సమయంలో ఆమె అనుచరులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై నేడు దాడి చేశారు. తమ నాయకురాలిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
వారిని చెదరగొట్టేందుకు మల్లన్న సెక్యూరిటీ గార్డు తన తుపాకీతో గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో పరస్పరం పోలీసులకు పిర్యాదులు చేసుకోగా కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కేటీఆర్ అనుచరులు టీవీ5 కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత అనుచరులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు.
మహిళ అయిన కల్వకుంట్ల కవితని ఉద్దేశించి మల్లన్న ఆవిదంగా మాట్లాడటం ఎంత తప్పో, ఆయన కార్యాలయంపైఆమె అనుచరుల చేత దాడి చేయించడం కూడా అంతే తప్పు. ఒకరు పార్టీ నుంచి సస్పెండ్ కాగా మరొకరు పార్టీలో ఉన్నానో లేదో కూడా చెప్పలేకపోతున్నారు. అయినా ఇద్దరి తీరు మారలే
దు.
రాజకీయ నాయకులు ఈ విపరీత ధోరణి ఇలాగే కొనసాగిస్తే మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాలు బిహార్‌లా మారిపోవడం ఖాయం.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…