ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ‘కంటెంట్’ ఉన్న సినిమాల వైపుకే మొగ్గు చూపుతున్నారు. విషయం ఉందనుకుంటే హీరో, హీరోయిన్, దర్శకుడు… ఎవరితోనూ సంబంధం లేకుండా ఆదరిస్తున్న వైనం చిన్న సినిమాలకు కొత్త ‘ఊపిరి’ని ఇస్తోంది. ఆ క్రమంలోనే మేం కూడా కంటెంట్ నే నమ్ముకుని వస్తున్నాం… ప్రేక్షకులు ఆదరించండి… “అత్తారిల్లు” నిర్మాత అంజన్ కే కళ్యాణ్ చెప్తున్నారు.
ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సాయి రవికుమార్, అతిథి దాస్, నండూరి రాము, రాకేశ్ శర్మ, ఉదయ్ శరత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో… ‘పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న హీరోయిన్… ముహూర్తం మించిపోతోంది… ఎవడో ఒకడు రండ్రా…’ అనే క్యాప్షన్ ఇవ్వగా, భయంతో వెనుక ఉన్న మరికొందరు… ‘అమ్మో అది తేడాగా ఉంది… అందరం కలిసివెళ్దాం పదండ్రా…’ అనే మరో క్యాప్షన్ ఉంది.
హార్రర్ కామెడీగా తెరకెక్కిన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకునే విధంగానే ఉండగా, ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం. కధ, కధనం అద్భుతంగా ఉంటే సినిమా విజయానికి ఆకాశమే హద్దుగా తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని, మా “అత్తారిల్లు” కూడా అలాంటి విజయాన్నే అందుకుంటుందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామని నిర్మాత తెలిపారు.



