జగన్‌ గేట్లు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట

Avanthi Srinivasa Rao says 10 TDP MLA ready to join YSRCPగోదావరిలో బొట్టు మునక, సెక్రటేరియట్ పరీక్ష పాత్రల లీక్, టీటీడీ వివాదం వంటి వివిధ విషయాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతిపక్ష పార్టీ, టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మైండ్ గేమ్స్ మొదలుపెట్టినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ గేట్లు తెరిస్తే 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడతామంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

ADVERTISEMENT

టీడీపీ అవినీతి, దోపిడీని భరించలేకే ప్రజలు జగన్‌కు పట్టంకట్టారన్నారు. ప్రజలలో జగన్ కు పెరుగుతున్న పాపులారిటీ ఓర్వలేక టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారని హెచ్చరించారు.

ఎమ్మెల్యేలను ఆకర్శిస్తాం అని బెదిరించే కంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా పాలించడం బెటర్ కదా మంత్రి గారు? గత ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యేలను 23 మందిని టీడీపీ లాక్కుందని జగన్ తరచూ చేసే ఆరోపణ. పైగా ఆ కారణం గానే దేవుడి టీడీపీని శిక్షించి 23 ఎమ్మెల్యే సీట్లకు, మూడు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితం చేశారని జగన్ తరచు ఎద్దేవా చేస్తున్నారు.

తాను ఇటువంటి వాటికి పూర్తిగా వ్యతిరేకమని, రాజీనామా చెయ్యకుండా ఎవరిని తీసుకోను అని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరి అదే విషయంగా ఇప్పుడు బెదిరిస్తే అది వారికే మంచిది కాదు.

ADVERTISEMENT
Latest Stories