ట్రైలర్ టాక్ – తెరవెనుక నిజాలు చూపించారట!

Azhar Trailer talkఇండియన్ క్రికెట్ ను – అజారుద్దీన్ ను వేరుచేసి చూడలేం. ప్రపంచ క్రికెట్ లో భారత్ ఆధిపత్యం మొదలైంది అజార్ కెప్టెన్సీలోనే..! అయితే ఆ తర్వాత ఏర్పడిన అనూహ్య పరిణామాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అన్నీ అజరుద్దీన్ జీవితాన్ని మార్చేసాయి. అప్పటివరకు దేవుడిగా కొలిచిన వారికి ఒక్కసారిగా దెయ్యంలా కనపడ్డారు. అయితే అజార్ జీవితంలో అసలు తెరవెనుక ఏం జరిగింది? అది అజరుద్దీన్ కు మాత్రమే తెలిసిన విషయం.

కానీ ఇలాంటి నిజాలన్నీ తన సినిమాలో చూపిస్తానంటూ “అజార్” సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అజార్ పాత్రను ఇమ్రాన్ హాష్మి పోషిస్తుండగా, అజార్ క్రికెట్ జీవితం ఎంత ఆసక్తికరమో, వ్యక్తిగత జీవితం అంతకు మించిన సంచలనం. సినీ నటి సంగీత బిజ్లానితో అజార్ చేసిన రొమాన్స్, తదుపరి పెళ్లి… ఇలా అనేక సంచలనాల సమాహారం అజార్ జీవితం. మరి ఈ జీవితాన్ని వెండితెరపై ఎంత ఆసక్తికరంగా మలిచారో తెలుసుకోవాలంటే మే 13వ తేదీ వరకు వేచి చూడమంటున్నారు “అజార్” చిత్రయూనిట్.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories