బాహుబలి 2 – షాకింగ్ రెమ్యూనరేషన్స్!

Baahubali 2 Actors Remunerationsబాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 1200 కోట్లు దాటిన “బాహుబలి 2 – ది కన్ క్లూజన్” సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి ఖాతాలో ఎన్ని కోట్లు వెళ్ళుంటాయి? అలాగే అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా నటించిన ప్రభాస్ కు ఎంత మొత్తం చేరి ఉంటుంది? ఇక సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించిన భళ్ళాలదేవుడు, శివగామి, కట్టప్ప తదితరులకు ఎంత దక్కి ఉంటుంది? ఇలా రకరకాల ప్రశ్నలు సినీ జనాల్లో, అభిమానుల మదిలో మెదులుతున్నాయి?

అయితే ఈ రెమ్యూనరేషన్లపై ఇప్పటికే చాలా పుకార్లు షికార్లు చేసాయి. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… పేపర్ పరంగా ‘బాహుబలి 2’ చిత్ర యూనిట్ కు లభించిన పారితోషిక వివరాలు ఇలా ఉన్నాయి. ‘దర్శకధీరుడు’ రాజమౌళికి 28 కోట్లు, ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ కు 25 కోట్లు, రానాకు 15 కోట్లు, ‘స్వీటీ’ అనుష్కకు 5 కోట్లు, రమ్యకృష్ణకు 2.50 కోట్లు, సత్యరాజ్ కు 2.50 కోట్లు దక్కినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తమ్మీద 1500 కోట్లు కొల్లగొట్టే సినిమాకు వీరికి దక్కింది ఇంతేనా? అన్న అనుమానం కలుగక మానదు.

ADVERTISEMENT

విషయం ఏమిటంటే… ఈ సినిమా 1500 కోట్లకు చేరుకుంటుందని ముందుగానే ఎవరూ ఊహించలేదు కదా! ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఇంత మొత్తం దక్కినా, ఆ తర్వాత చిత్ర నిర్మాతలు ‘బహుమానం’ రూపంలో ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే, గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాకు భారీ లాభాలు రావడంతో దర్శకుడు కొరటాల శివకు నిర్మాతగా భాగస్వామ్యుడైన మహేష్, ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. బహుశా ఈ రూపంలో ‘బాహుబలి 2’ యూనిట్ కు ఏమైనా దక్కుతుందేమో..!?

ADVERTISEMENT
Latest Stories