భారీ అంచనాలతో సంచలన విజయాన్ని నమోదు చేసి 600 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ‘బాహుబలి’ సినిమా తదుపరి విభాగం పై కూడా భారీ నుండి అతి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో క్రేజీ సినిమాలపై కన్నేసే మార్కెట్ వర్గాలు, ‘బాహుబలి’ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్లతో ముందుకు వస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో భారీ లాభాలు అందుకోవడంతో, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది.
ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో, ‘బాహుబలి-2’కు చుక్కలు చూపించే ధరలను చెప్తున్నారట నిర్మాతలు. ‘బాహుబలి’ సినిమా యుఎస్ఏ, యూరోప్, గల్ఫ్, ఆస్ట్రేలియా దేశాలకు కలిపి 10 కోట్లకు అమ్మిన నిర్మాతలు, ప్రస్తుత పార్ట్ కు మాత్రం ఒక్క యూరోప్ దేశపు హక్కులకే 35 కోట్లు చెప్తున్నారని టాక్.
మరి ఈ రేంజ్ లో వసూళ్లు వస్తాయో లేదో గానీ, ఏకంగా 35 కోట్లు అంటుంటే నోరెళ్ళబెట్టడం పంపిణీదారుల వంతవుతోందట. మరి ఇంత మొత్తంలో ‘బాహుబలి 2’ను అసలు కొనుగోలు చేస్తారో లేదో అన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.



