
అయితే బాహుబలి ప్రచారంలో భాగంగా రానాతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కి ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్నే ఎదురైంది. “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని” ప్రభాస్ ను అడగగా… అందుకు ఓ సమాధానం ఇచ్చాడు. కట్టప్ప బాహుబలిని కావాలని చంపలేదని, చిన్న కన్ఫ్యూజన్‌లో బాహుబలిని వెనక నుంచి చూసి భల్లాలదేవుడు అనుకుని చంపేశాడని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు. ఇది సరదాగా చమత్కరించినట్లుగా కనపడుతున్నా… ఇది కూడా నిజం కావచ్చంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవలే రానాకు ఇటువంటి ప్రశ్నే ఎదురుకాగా, తనకు ఆ విషయం తెలియదని ఆ సీన్ చీకట్లో ఉందని, తనకు సరిగా కనిపించలేదని సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నిజంగా బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు వేచిచూడాల్సిందే. అప్పటివరకు ఇలా ఆ స్టార్లు చెబుతున్న ఇలాంటి సరదా కబుర్లతో సంబర పడడం అభిమానుల వంతవుతోంది. దాదాపుగా 8 వేల స్క్రీన్లలో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ సినిమా ఫస్ట్ డే నాడు 200 కోట్లకు చేరువ అవుతుందని అంచనా.
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…