‘బాహుబలి’ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చూడండి!

baahubali2-the conclusion maniaదేశం మొత్తం ఎదురుచూస్తున్న “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు తొలి రోజు ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయోనని సినీ పండితులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగిన విధంగానే టికెట్ల ధరలను కూడా పెంచుతుండడంతో కనివినీ ఎరుగని రికార్డులు “బాహుబలి 2” సొంతమవుతాయని ట్రేడ్ వర్గాల టాక్. టికెట్ ధరల పెంపు ఈ సినిమాపై ప్రభావితం అయ్యే అవకాశం లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!

ఎందుకంటే అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో ‘బాహుబలి 2’ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి. బహుశా యంగ్ రెబల్ స్టార్ అభిమానో లేక బాహుబలి సినీ ప్రేమికుడో గానీ, తన వీపుపై ఏకంగా అమరేంద్ర బాహుబలి స్వరూపాన్ని టాట్టూ రూపంలో వేయించుకున్నాడు. అలాగే పోస్టర్ లో చూపించిన విధంగానే పక్కనే నెత్తుటి చుక్కలను కూడా తన వీపుపై వేయించుకోవడం చూస్తుంటే… ఇంతటి క్రేజ్, రజనీకాంత్ సినిమాలకు కూడా దక్కలేదనే చెప్పాలి. దీంతో సదరు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోష పెడుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories