బాహుబలి 2… సండే ఫీస్ట్..!

Baahubali 2 World Wide Box Office Collectionsఏప్రిల్ 28వ తేదీ ముందు వరకు యుఎస్ మార్కెట్ లో తెలుగు సినిమాల వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం “బాహుబలి – ది బిగినింగ్.” దాదాపుగా 7.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన ఈ సినిమా దగ్గరలోకి వచ్చిన తెలుగు సినిమా మరొకటి లేదు. ఇక ‘బాహుబలి 2’పై ఉన్న భారీ అంచనాల రీత్యా, యుఎస్ మార్కెట్ లో మొదటి పార్ట్ ఎంత వసూలు అయితే సాధించిందో, అంతపెట్టి కొనుగోలు చేసి మార్కెట్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు.

యుఎస్ ప్రేక్షకులపై ఉన్న నమ్మకమో లేక రాజమౌళిపై ఉన్న విశ్వాసమో గానీ అంత పెట్టుబడులు పెట్టడం అనేది ఒక విధంగా ‘గ్యాబ్లింగ్’ లాంటిదేనని ట్రేడ్ పండితులు భావించారు. ఒకవేళ సినిమా హిట్టయినా కూడా పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చి, కాసింత లాభాలను మాత్రమే అందిస్తుందని, మహా అయితే 10 – 12 మిలియన్స్ మధ్య వసూలు చేస్తుందని అంచనాలు వేసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ‘బాహుబలి 2’ ఈ సండే నాటితో 20 మిలియన్ మార్క్ ను చేరుకోబోతుండడం అంచనాలు వేసినది మాత్రం కాదు.

ADVERTISEMENT

తొలుత వెలువడిన టాక్ ను బట్టి దాదాపుగా 15 మిలియన్ డాలర్స్ కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ యుఎస్ ప్రేక్షకులు ‘అంతకు మించి’ ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీలో మునిగి తేలుతున్నారని చెప్పవచ్చు. అయితే ఈ రికార్డు దరి చేరడానికి తొలి వారంలో టికెట్ ధరల పెంపు ఒక కారణమైనా గానీ, అసలు అంత ధర పెట్టి టికెట్ కొన్నారంటే అది ‘బాహుబలి 2’ సత్తా క్రిందే భావించాలి. 20 మిలియన్ డాలర్స్ కు చేరుకోవాలంటే ఇంకా దాదాపుగా 5 లక్షల డాలర్స్ కావాల్సి ఉండగా, ఈ వీకెండ్ తో అది పూర్తవుతుందని ట్రేడ్ పండితులు ఖచ్చితంగా చెప్తున్న విషయం.

ADVERTISEMENT
Latest Stories