బీజేపీలోకి బాబు మోహన్

Babu-Mohan-BJPఒకప్పుడు చంద్రబాబు నాయుడు టిక్కెట్టు ఇవ్వలేదని ఆయనను తిట్టి పోసి తెరాసలో జాయిన్ అయ్యారు నటుడు బాబు మోహన్ . సీటు ఇచ్చిన కేసీఆర్ పై అనేక సంధర్భాలలో ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఈ సారి బాబు మోహన్ కు సీటు లేదన్నారు కేసీఆర్. వందకు పైగా సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే వాటిలో ముగ్గురు సిట్టింగులకు మాత్రమే సీటు నిరాకరించారు.

[ma9d]

ADVERTISEMENT

అందులో బాబు మోహన్ ఒకరు దానితో ఆయన అది అవమానంగా భావిస్తున్నారు. దీనితో ఆయన బీజేపీలో చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే బాబు మోహన్ గనుక పార్టీ మారితే ఆయనను పట్టుబట్టి కేసీఆర్ ఓడిస్తారని అంతా అనుకుంటున్నారు. పైగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు పట్టు లేదని అంటున్నారు.

బాబు మోహన్ పై నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. అయితే తనకు సీటు ఇవ్వకపోతే ఇవ్వడానికి చాలా మంది రెడీ గా ఉన్నారని ముఖ్యమంత్రికి రుజువు చెయ్యాలని పంతంగా ఉన్నారు ఆయన. కాంగ్రెస్ తరపున పోటీ చేద్దామని అనుకున్న టీడీపీతో పొత్తు ఉండటంతో చంద్రబాబు తనకు సీటు రానివ్వరని ఆయన భయం.

ADVERTISEMENT
Latest Stories