బాలకృష్ణ 1000వ సినిమా అట… నెటిజన్లు ఏకేస్తున్నారు..!

Royal Balayya: Gautamiputra Satakarani Pre-Lookనందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. వందవ సినిమా వచ్చే పాటికి బాలకృష్ణ కెరీర్ దాదాపుగా తుది దశకు చేరుకుంది. మహా అయితే బాలయ్య బాబు నుండి మరో పది, పదిహేను సినిమాలకు మించి ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ, ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత బిఎ రాజు మాత్రం ఏకంగా 1000వ సినిమా అప్ డేట్స్ ఇచ్చే పాటికి అవాక్కయ్యారు నెటిజన్లు.

రెగ్యులర్ సినిమా అప్ డేట్స్ లో భాగంగా బిఎ రాజు చేసిన ట్వీట్స్ లో బాలకృష్ణ 100వ సినిమా గురించి చెప్తూ పొరపాటున మరొక ‘సున్నా’ ప్రెస్ అవ్వడంతో, 100వ సినిమా కాస్త 1000వ సినిమాగా మారిపోయింది. ఇంకేముంది… నెటిజన్లు ఏకేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే కదా! అదే జరిగింది… రాజు ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే తన తప్పును గమనించిన రాజు గారు తర్వాత దాన్ని సరిదిద్దుకున్నారు.

ADVERTISEMENT

ఇటీవల మహేష్ బాబు చేసిన ఓ ట్వీట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిన సమయంలో పవన్ అభిమానులు చేసిన హడావుడి తెలియనిది కాదు. ఇలా సెలబ్రిటీల ట్వీట్లలో దొర్లే చిన్న చిన్న తప్పులతో వెబ్ ప్రపంచంలో సందడి చేయడం నెటిజన్లకు పరిపాటిగా మారిన తరుణంలో మంగళవారం నాడు బిఎ రాజు చేసిన ట్వీట్ ఆహారంగా మారినట్లయ్యింది.

BA Raju Tweet

ADVERTISEMENT
Latest Stories