‘సర్ధార్’తో పాటు ‘నందమూరి నటసింహం’ కూడా..!

Nandamuri balakrishnaఈ ఏడాది ఉగాది పర్వదినం అగ్ర హీరోల సినీ అభిమానులకు కన్నుల పండుగ కాబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల తేదీ కాచుకుని కూర్చోగా, ప్రిన్స్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించిన రెండవ టీజర్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపడానికి సిద్ధమవుతోంది.

ADVERTISEMENT

ఈ రెండు ఇలా ఉంటే… తాజాగా ఉగాది వేడుకలకు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రెడీ అయ్యారు. బాలయ్య బాబు ప్రతిష్టాత్మక 100వ సినిమా ప్రకటన ఏప్రిల్ 8వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22వ తేదీ నుండి జరగనుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణ, యోధుడు’ అన్న టైటిల్స్ హల్చల్ చేస్తున్నప్పటికీ, టైటిల్ ప్రకటన కూడా ఏప్రిల్ 8వ తేదీన ఉండే అవకాశముంది.

తాజా వార్తతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఈ ఏడాది ‘డిక్టేటర్’ ద్వారా అభిమానులను ఆకట్టుకున్న బాలకృష్ణ తదుపరి సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్ నిరీక్షణ తీరినట్లయ్యింది. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories