
విశాఖలో టీఎస్సార్ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న బాలయ్యను మీడియా వర్గాలు ప్రశ్నించే క్రమంలో… “పవన్ కళ్యాణా? ఎవరతను? నాకు తెలియదు” అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మైండ్ బ్లాక్ అవ్వడం మీడియా వంతయ్యింది. బాలయ్యకు నిజంగానే పవన్ కళ్యాణ్ తెలియదా? అంటే… ఇది ఫేక్ వీడియో అని కొందరు అంటుంటే, మీడియా వర్గాల ప్రశ్నలను వదిలించుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడి ఉంటారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కారణం ఏదైనా గానీ… బాలయ్య పేరుతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒకవేళ బాలకృష్ణ స్వయంగా అన్నా కూడా, ఎవరూ సీరియస్ గా పరిగణించరన్న విషయం తెలిసిందే. రాజకీయ వేదికలపై అయినా… సినీ వేడుకలలో అయినా… బాలయ్య రూటే సపరేటు..! దానికి అడ్డు చెప్పే వారు గానీ, ప్రశ్నించే వారు గానీ ఎవరు ఉండరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! మరి పవన్ కళ్యాణ్ నుండి దీనికి కౌంటర్స్ వస్తాయేమో చూడాలి.
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…
Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…