బాబు మంత్రి వర్గంలో బాలయ్య బాబు?

Balakrishna to Join Chandrababu Naidu's Cabinetఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న వేళ, మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని వార్తలు వస్తున్న తరుణంలో హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ కూడా కొత్త మంత్రుల జాబితాలో ఉంటారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పనితీరు అంతంత మాత్రంగా ఉన్న పల్లె రఘునాథరెడ్డిని మంత్రి వర్గం నుండి తప్పించవచ్చని తెలుగుదేశం వర్గాలు చెప్పుకుంటున్నాయి. పల్లె నిర్ణయాత్మక ధోరణితో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

బాలకృష్ణతో పాటు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు కూడా రేసులో ఉన్నట్లు టాక్. అలాగే నారా లోకేష్ పేరు కూడా బలంగానే వినపడుతున్నా, ఈ సారికి లోకేష్ కు అవకాశం దక్కకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేష్ లేదా బాలకృష్ణకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే గనుక, అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు అవకాశం లభించకపోవచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories