Telugu

బనకచర్ల: వైసీపీ కి పట్టదా.?

రాష్ట్ర రాజధాని అమరావతి వరద ప్రాంతం, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పిపోయాయి, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ప్రతిపక్ష నాయకులకు భద్రత లేదు, ఆంధ్రప్రదేశ్ రావణకాష్టంగా మారిపోయింది అంటూ నిత్యం రాష్ట్ర గౌరవ, మర్యాదలను బజారున పెట్టె వైసీపీ అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రజల అవసరాల కోసం ఎంతవరకు పోరాడుతుంది.?

ADVERTISEMENT

వైసీపీ నేతల అవినీతి కేసులకు మద్దతు పలకడానికి, వారి కోసం జైలు యాత్రలు చేయడానికి, రాష్ట్రం లో గంజాయి ముఠాల భద్రత కోసం పరామర్శల యాత్రలు నిర్వహించడానికి, బలప్రదర్శన పేరుతో దాడులను ప్రోత్సహించడానికి, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం కూటమి ప్రభుత్వం తో పోరాడడానికి,

పోలీసుల బట్టలుదాటేస్తా, వచ్చేది మేమే, అందరి లెక్కలు సరిచేస్తా, జగన్ 2.0 రుచి చూపిస్తా అంటూ బెదిరింపు కార్యక్రమాలు చేయడానికి సమయం ఉన్న వైస్ జగన్ కు రాయలసీమ నీటి అవసరాల కోసం నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్ మీద మాట్లాడేందుకు సమయం లేదా.? బిఆర్ఎస్ తో ఉన్న స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడతారా.?

రాయలసీమ ప్రాంతం కర్నూల్ జిల్లాలోని పాములవాడ మండలం లో బనకచర్ల అనేది ఒక గ్రామం. అయితే పోలవరం నుంచి వృథాగా సముద్రంలో కలిసిపోయే గోదారి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేసి తద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీటి వసతులను సమకూర్చడమే ఈ ప్రాజెక్ట్ అంతిమ లక్ష్యం.

దాదాపు 80 కోట్ల ప్రతిపాదిత వ్యయం తో సుమారు 7.5 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకురావడానికి, ఇప్పటికే ఉన్న 22 లక్షల ఎకరాల సాగు భూములను స్థిరీకరించడానికి చేపట్టినదే బనకచర్ల ప్రాజెక్ట్. మూడు దశల్లో పూర్తి చేసే క్రమంలో భాగంగా

* మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం,
* రెండవ దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం,
* మూడవ దశలో బొల్లాపల్లి నుండి బంకచర్ల వరకు నీటిని తరలించడం

అయితే ఏపీ ప్రభుత్వ లక్ష్య నిర్ములన కోసం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం, తెలంగాణ హక్కుల పేరుతో బిఆర్ఎస్ నీటి రాజకీయానికి పునాదులు వేస్తుంది. అయితే తెలంగాణ హక్కుల కోసం అవసరం లేని విషయాలలో కూడా బిఆర్ఎస్ అంతలా రాద్ధాంతం చేస్తున్నా,

ఏపీలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంతలా రెచ్చకొడుతున్నా మరి ఏపీ ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రజల నీటి అవసరాల కోసం వైసీపీ అధినేత వైస్ జగన్ ఎందుకు గళం విప్పడం లేదు. ఎందుకు పోరాట యాత్రలు నిర్వహించడం లేదు.

రాయలసీమ బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం కూటమి ప్రభుత్వం తో పోరాడుతున్న వైస్ జగన్ సొంత రాష్ట్రం కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం కనీసం బిఆర్ఎస్ ను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు.? బిఆర్ఎస్ కు వైసీపీ కి మధ్య తత్సబంధాలు బలంగా ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల వాదన, వారి ప్రయోజనాలను వైసీపీ ఎందుకు బిఆర్ఎస్ కు వివరించలేకపోతుంది.?

ఏపీ ప్రభుత్వం నుంచి నీటి పారుదల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సముద్రంలో వృథాగా కలిసే నీటిని మాత్రమే రాయలసీమ కరువును తీర్చేందుకు సద్వినియోగం చేస్తున్నామని, దీని వలన తెలంగాణ ప్రజలకు కానీ, అక్కడి రైతులకు కానీ ఎటువంటి నీటి నష్టం చేకూరాదంటూ ప్రాజెక్ట్ నిర్మాణం పై పూర్తి స్పష్టత ఇచ్చారు.

అలాగే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండానే తెలంగాణలో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను నిర్మించలేదా.? నాడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్న ఆలోచన కానీ, వాటి పై విమర్శలు చేసి రాజకీయ లబ్ది పొందాలన్నా దురుద్దేశం కానీ తమకు లేదని కండబద్దలు కొట్టారు.

ఇక నేడు బనకచర్ల ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం కేవలం తమ పార్టీ రాజకీయ స్వార్ధం కోసమే అని, ఆ వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకుంటుంది అంటూ ఏపీ ప్రభుత్వం నుండి అటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి ధీటైన బదులు చెప్పారు నిమ్మల. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి వారి ప్రజల మనోభావాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇవ్వగలిగింది.

కానీ సోనియాను ఎదిరించిన ధీరుడిగా, చంద్రబాబుని జైలుకి పంపిన సూరుడిగా జగన్ పై ప్రగల్భాలు పలికే వైసీపీ ఇప్పుడు బంకచర్ల ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పలేకపోతుంది.? రాష్ట్రంలో రోజుకో రచ్చ లేపుతూ నిత్యం వివాదాలతో కాలక్షేపం చేసే వైసీపీ రాయలసీమ ప్రజల అవసరాల కోసం బిఆర్ఎస్ తో ఎందుకు కాలు దువ్వలేకపోతుంది.?

ఏపీ నీటి ప్రోజెక్టుల పై పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఇంతలా రగడ చేస్తున్నా వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత జగన్ కు లేదా.? గెలిచిన సీట్లు కాదు వచ్చిన ఓట్లు పరిగణలోకి తీసుకోవాలి అంటూ ప్రవచనాలు వల్లెవేసే వైసీపీ ఇప్పుడు ఎందుకు పక్కకి తప్పుకుంటుంది.? బిఆర్ఎస్ తో స్నేహ సంబంధాలు తెగిపోకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను, ఇక్కడి ప్రజలు మనోభావాలను బిఆర్ఎస్ రాజకీయం ముందు తాకట్టు పెడతారా.?

కూటమి ప్రభుత్వం కూడా అటు తెలంగా రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వడమే కాదు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పై కూడా ఈ విషయంలో ఎదురుదాడి చెయ్యాల్సిందే. గత ఐదేళ్లు తెరచాటు గా సాగిన బిఆర్ఎస్, వైసీపీ ల బంధం నేడు ఫోన్ టాపింగ్ కేసులతో, బనకచర్ల పై జరుగుతున్న రగడ తో బట్టబయలయ్యింది. దీనికి వైసీపీ అధినేత వైస్ జగన్ కచ్చితంగా ఏపీ ప్రజలకు, రాయలసీమ వాసులకు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

3 Biggest Disasters: Even 50% Discounts Couldn’t Save

The month of September in the ongoing year turned out to be unlucky for a…

21 minutes ago

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

9 hours ago