
పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రెండు వారాలు చర్లపల్లి జైలుకి వెళ్ళాల్సిరావడం అతని తండ్రి బండి సంజయ్‌కి తీరని అప్రదిష్టే. కొడుకు వలన ఆయన తలదించుకోవాల్సివస్తోంది. ఇది చాలా తీవ్రమైన కేసు కనుక సాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు, బిజేపి ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఎవరూ కూడా బండి సంజయ్‌కి సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడలేదు. అంటే ఈ తప్పుని వారు సమర్ధించడం లేదన్న మాట!
తెలంగాణ బిజేపిలో సీనియర్ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి, ఇదివరకు బిజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధి అనుకున్న బండి సంజయ్‌కి ఎదురైన ఈ పరిస్థితిపై బిజేపి అధిష్టానం ఏమనుకుంటుందో తెలీదు. కానీ బీఆర్ఎస్ పార్టీ.. దాని అధినేత కేసీఆర్‌తో సహా పార్టీ నేతలందరి రాజకీయ జీవితం ఈవిధంగా దయనీయ స్థితికి చేరుకోవడానికి బండి సంజయ్ ప్రధాన కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావించి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం సహజమే.
ఏవిధంగా అంటే, నాడు బండి సంజయ్ దెబ్బకి కేసీఆర్ ఆలోచనా ధోరణిలో పెను మార్పు వచ్చింది. బండి సంజయ్ తన స్థాయికి తగినవాడు కాడని భావించిన కేసీఆర్, ప్రధాని మోడీని శత్రువుగా ఎంచుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధాని మోడీని గద్దె దింపేస్తానంటూ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు.
ఆ తర్వాత స్టోరీ అందరికీ తెలిసిందే. కనుక బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం కేసీఆర్ అని అందరూ అనుకుంటే, బండి సంజయ్ అని బీఆర్ఎస్ పార్టీ అనుకోవడం సహజమే.
కనుక ఆయనపై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి బండి భగీరథ్ రూపంలో బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయారని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధర్నాలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి సృష్టించగలిగింది. దాని ఫలితమే బండి భగీరథ్ అరెస్ట్… జైలుకి వెళ్ళాల్సి వచ్చింది.
కానీ ఇంతటితో బండి సంజయ్‌ని విడిచిపెట్టాలని కేటీఆర్ అనుకోవడం లేదు. భవిష్యత్‌లో మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ రాకుండా చేయాలనుకుంటున్నారో ఏమో… ఆయనని కేంద్రమంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని కొత్త డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే బండి భగీరథ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ పోలీసులపై ఒత్తిడి చేసి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని కేటీఆర్ అన్నారు. కనుక ప్రధాని మోడీ తక్షణం బండి సంజయ్‌ని కేంద్రమంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేస్తారా?
Union Minister G. Kishan Reddy dropped a political bombshell in Hyderabad today, Sunday, May 17,…
Megastar Chiranjeevi and director Bobby Kolli are teaming up for their second collaboration, with #Chiru158…