
‘తనకేదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిద్దరినీ విమర్శిస్తూ తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని, దీంతో తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారని’ పేర్కొన్నారు. తనకు వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో సెంట్రల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశానని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పోలీసులు తప్పుడు నివేదిక ఇవ్వడమే ఇందుకు కారణమన్నారు. చివరికి హైకోర్టును ఆశ్రయించానని, ఈ నెల 22వ తేదీ లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఉదయ్ కిరణ్ చేస్తున్న విమర్శల మాదిరే ఈ ఆరోపణలు కూడా అర్ధరహితమని పవన్ అభిమానులు మండిపడుతుండగా, టిడిపి వర్గాలు ఈ ఆరోపణలను అసలు పరిగణనలోనికి తీసుకోవడం లేదు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…