
తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలంటూ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా అది ఆమోదం పొందేందుకు తోడ్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తుంటే అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తోంది!
బీసీ బిల్లు కోసం కమీషన్ ఏర్పాటు చేయకుండా, కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన తీర్మానాన్ని ఆమోదింపజేయకుండా ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్స్ అమలుచేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అంటూ బీఆర్ఎస్ పార్టీ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తోంది.
కానీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం ఇందుకు భిన్నంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. తమ పోరాటాల వల్లనే తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించడానికి అంగీకరించిందని చెప్పుకున్నారు. దీంతో తాము (రాజకీయంగా) ఒక మెట్టు ఎక్కినట్లే భావిస్తున్నామని అన్నారు.
కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్స్ వస్తున్నందుకు పండగ చేసుకోమని చెబుతుంటే, బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నందుకు నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీకి స్పష్టత లోపించిందని అర్దమవుతోంది. పైగా నేను ఓ మెట్టు పైకి ఎక్కానని కల్వకుంట్ల కవిత చెప్పుకోవడం బీఆర్ఎస్ పార్టీ అండదండలు లేకపోయినా తాను రాజకీయాలలో మనుగడ సాగించగలనని చెప్పినట్లే భావించవచ్చు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…