అయ్యో… రీల్ కవచం… రియల్ ప్రేక్షకుడు..!

 Bellamkonda Sai Srinivas spectatot while chota k naidu kissing Kajal Aggarwalహీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అనునిత్యం రక్షిస్తూ… ఆమెకు – విలన్లకు నడుమ “కవచం”లా తానుంటానని రీల్ స్క్రీన్ మీద బెల్లంకొండ శ్రీనివాస్ “కవచం” రూపంలో చెప్పుకొచ్చారు. కానీ అదే బెల్లంకొండ, రియల్ లైఫ్ కు వచ్చేపాటికి కళ్ళ ముందు జరుగుతున్న దానిని అడ్డుకోలేక రియల్ ప్రేక్షకుడిగా మారిపోయిన వైనం అవాక్కు చేసింది.

ADVERTISEMENT

[m9ad]

సినిమాలో కాజల్ ను రక్షించే సాయి శ్రీనివాస్, రియల్ గా మాత్రం ఆ పని చేయలేకపోయారని, దీంతో శ్రీనివాస్ రీల్ ‘కవచం’ మాత్రమేనని సోషల్ మీడియా జనులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుండి చోటాను బహిష్కరించాల్సిందిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఉదంతంతో ‘కవచం’కు తగినంత పబ్లిసిటీ లభిస్తోంది.

ఈ పర్యవసానం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో క్లిక్స్ 1 మిలియన్ దాటగా, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాలు కూడా కలిపితే ఈ సంఖ్య మరో 1 మిలియన్ దాటి… మొత్తంగా 2 మిలియన్స్ ను సొంతం చేసుకుంది. మామిళ్ళ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ మెహ్రీన్ కూడా కనువిందు చేయనుంది.

ADVERTISEMENT
Latest Stories