Telugu

హత్యలకు కూడా ఏఐ !!!

ఏఐ.. ఏం చేయగలదు? ఇది తప్పు ప్రశ్న. ఏఐ.. ఏం చేయలేదు? అనేది సరైన ప్రశ్న.

సామాన్య ప్రజలు మొదలు వివిధ రంగాల వరకు ఎవరి అవసరాలకు తగ్గట్లు వారు ఏఐని వాడుకుంటున్నారు. వారికి ఏఐ అదేవిధంగా తోడ్పడుతోంది.

ADVERTISEMENT

వివిధ సంస్థలు ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగించి వారు చేసే పనులను ఏఐతో చేయించుకుంటున్నారు. అలాగే సినీ పరిశ్రమ కూడా ఏఐని విరివిగా వాడుకుంటోంది. ఇలా నిర్మాత్మక పనులకే కాకుండా జాన్వీ కపూర్‌ నకిలీ అశ్లీల వీడియోను సృష్టించడం వంటి నేరాలకు కూడా ఉపయోగించుకోవడం అందరూ చూశారు.

ఇప్పుడు బెంగళూరులో ఓ వ్యక్తి మరో అడుగు ముందుకు వేసి హత్యలు చేయడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

ఇటీవల బెంగళూరులోని కేఆర్‌పురలో ఓ యువతి కెనేత్ అనే టెకీతో ప్రేమలో పడింది. అయితే ఈవిషయంలో ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు చెపుతున్నారు. అతనికి దూరంగా ఉండాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు.

కుటుంబ సభ్యుల తీరుతో తీవ్ర అసహనానికి గురైన ఆమె, తన ప్రియుడితో కలిసి తన తల్లితండ్రులను, చెల్లిని హత్య చేయించింది. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి.

ఈ హత్యల కోసం అతను ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ప్లానింగ్ చేసుకున్నట్లు కనుగొన్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఏవిధంగా హత్యలు చేయాలి? అందుకు ఎటువంటి ఆయుధాలు వాడాలి? హత్యలు చేసిన తర్వాత తమపై ఎవరికీ అనుమానం కలుగకుండా ఏవిధంగా తప్పించుకోవాలి?వంటి సలహాలు, సూచనలు ఏఐ నుంచి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించి షాక్ అయ్యారు.

బెంగళూరు పోలీసులు ఏఐ ప్లానింగ్‌ ఫెయిల్ అని నిరూపించగలిగారు. కానీ ఇలాంటి నేరాలకు కూడా ఏఐని ఉపయోగించుకోవడం మొదలుపెడితే పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే చాలా ఆందోళన కలుగుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ రాజకీయ బొద్దింకలకు మోడీ, అమిత్ షాల వద్ద మందుందా?

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ళుగా అధికారంలో కొనసాగుతోంది. మరో మూడేళ్ళు ఎలాగూ ఉంటుంది. అంటే కాంగ్రెస్‌…

26 minutes ago

When Did Filmmakers Start Fearing Online Trolls?

When did filmmakers start getting so worried about what social media might say? People finding…

30 minutes ago