Telugu

ఈ రాజకీయ బొద్దింకలకు మోడీ, అమిత్ షాల వద్ద మందుందా?

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ళుగా అధికారంలో కొనసాగుతోంది. మరో మూడేళ్ళు ఎలాగూ ఉంటుంది. అంటే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి 15 ఏళ్ళుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండక తప్పదు.

కానీ ఒకవేళ మరో 5 ఏళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉండిపోవాల్సి వస్తే? బిజేపి నేతృత్వంలోని ఎన్డీయే మరింత బలపడుతుంది. అదే సమయంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలహీన పడుతుంది. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలవడం కాంగ్రెస్‌ పార్టీకి చాలా అవసరం.

ADVERTISEMENT

అందుకే కాంగ్రెస్‌ అధిష్టానం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయంగా పావులు కదుపుతోంది. ఇక్కడ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ గురించి రెండు ముక్కలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.

అయన కాంగ్రెస్‌ మిత్ర పక్షాల సాయం లేకుండానే తన ‘జాతీయ కల’ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి ఎదురుదెబ్బలు తిన్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం అటువంటి పొరపాట్లు చేయాడం లేదు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలను ఏకం చేసి, మోడీ నేతృత్వంలోని బీజేపీని, ఎన్డీయేను ఎదుర్కోవాలని భావిస్తోంది.

ఇటీవల ప్రతి రెండు మూడు నెలలకోసారి ఏదో ఒక అంశంతో ఎన్డీయే ప్రభుత్వంలో ఓ ప్రముఖుడి రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు చేస్తోంది.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమీషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీ, ముంబైలో ఆందోళనలు జరుగుతున్నాయి.

దానికి కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో పాటు ప్రధాని మోడీ, బిజేపిలను వ్యతిరేకించే పార్టీలు, శక్తులు సంఘీభావం తెలుపుతూ నిరసనల్లో పాల్గొంటున్నాయి.

పార్లమెంట్‌ లోపలా, బయటా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే.. రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్‌ దాని మిత్ర పక్షాలు, బిజేపి వ్యతిరేక శక్తులు, వాటి అనుబంధ సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ప్రకాష్‌ రాజ్‌ వంటి ప్రముఖులు వాటి మద్య అనుసంధాన కర్తలా పనిచేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

సాధారణంగా 10-15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ప్రజలకు అనేక లోపాలు కనిపిస్తుంటాయి. కనుక మార్పు కోరుకోవడం సహజం.

దేశ ప్రజలలో సహజంగా ఏర్పడే ఈ వ్యతిరేకతను ఇటువంటి ఉద్యమాలతో పెంచుతూ, వచ్చే ఎన్నికల నాటికి అనుకూల రాజకీయ వాతావరణంగా మార్చుకోవాలనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అది మోడీ ప్రభుత్వంలోకి ఈ రాజకీయ బొద్దింకలను ప్రవేశపెట్టినట్లు అనిపిస్తోంది. ఈ విషయం ప్రధాని మోడీ, అమిత్‌ షాలకు అర్థం కాదనుకోలేం.

ఈ నేపధ్యంలో ఎన్డీయే మిత్రపక్షాల సహాయ సహకారాలు బిజేపికి మరింత అవసరం. కనుక వాటికి మరింత దగ్గరవడం, రాష్ట్ర స్థాయిలో అవి బలోపేతం అయ్యేందుకు తోడ్పడటం చాలా అవసరం. మోడీ ప్రభుత్వం ప్రస్తుతం అదే చేస్తోంది.

ఇందుకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలు, ముఖ్యంగా వైసీపీ నేతలకు సంబంధించిన కేసులలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మోడీ, అమిత్‌ షాలు కూడా తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది.

కాంగ్రెస్‌-బీజేపీల ఈ రాజకీయ ఆధిపత్యపోరులో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

When Did Filmmakers Start Fearing Online Trolls?

When did filmmakers start getting so worried about what social media might say? People finding…

11 minutes ago

Jailer 2: Rajini Fans Fear Another Coolie After Trailer?

Ever since the most anticipated trailer of Rajinikanth's Jailer 2 directed by Nelson Dilipkumar, was…

41 minutes ago