
మొన్నటి దాకా కేవలం ఎవరు గెలుస్తారనే దానిపైనే బెట్టింగులు సాగగా, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిపై పందెం కాసే వారికి ఒక్క రూపాయికి ఒక్క రూపాయిని ఆఫర్ చేశారు. వైసీపీ గెలుపుపై పందెం కాసేవారికి ఒక్క రూపాయికి మూడు రూపాయలు ఇచ్చే విధంగా పందేలు కొనసాగుతున్నట్లుగా మీడియా వర్గాలు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తోంది. వీటితో పాటు మెజార్టీపై కూడా భారీ స్థాయిలోనే బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడేసరికి ఈ బెట్టింగ్ ల విలువ 2వేల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
కర్నూలు జిల్లాతో పాటు బళ్లారి, రాయచూర్, కోలార్, బెంగళూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ పైనే ఎక్కువ బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ప్రకటన కూడా తోడయినట్లుగా మరో టాక్. మంచి మెజార్టీ అని సూచించడంతో, గెలుపుతో పాటు మెజార్టీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే…
Telugu cinema has developed a habit of racing against time, especially when it comes to…