పోలీసుల ఎదుట స్టార్ హీరోయిన్!

Bhavana-appeared for police enquiry on molestation caseమాలీవుడ్ స్టార్ హీరోయిన్ భావనపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే హీరో దిలీప్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దిలీప్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు న్యాయస్థానం పేర్కొనగా, పోలీసులు అరెస్ట్ చేయడంతో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) నుంచి దిలీప్‌ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం దిలీప్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

అయితే తాజాగా దిలీప్ సతీమణి మరియు మరో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కావ్య మాధవన్ ను మంగళవారం నాడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) బి.సంధ్య ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ బృందం అలువాలోని దిలీప్ ఇంట్లో ప్రశ్నించింది. భావనపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత తాను కొచ్చిలో కావ్య నిర్వహిస్తున్న ఆన్‌ లైన్ మార్కెటింగ్ కంపెనీ ‘లక్ష్య’కు వెళ్లినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ దర్యాప్తులో వెల్లడించడంతో, ‘లక్ష్య’పై దాడులు నిర్వహించిన పోలీసులు కావ్యను విచారణ చేసారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories