
గత బహిరంగ సభలో అధికార వైఎస్సార్సీపీని తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు? అనేది రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. మరో వారం రోజుల్లో పవన్ సినిమా “భీమ్లా నాయక్” విడుదల కూడా ఉండడంతో, గతంలో మాదిరే మరోసారి వైసీపీపై గర్జిస్తారా? లేక కొంత శాంతంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారిన అంశం.
సాధారణంగా అయితే జగన్ రాజకీయ సిద్ధాంతాలు, అలాగే గడిచిన మూడేళ్ళుగా అధికారంలో ఉండి చేస్తోన్న జగన్ పాలనకు పూర్తి విరుద్ధంగా, పవన్ ‘జనసేన’ సిద్ధాంతాలు, పోకడలు ఉంటాయి గనుక, రాజకీయంగా వైసీపీకి ఎప్పుడూ పవన్ విరోధి అనే భావించవచ్చు. తన సినిమా రిలీజ్ కోసమని జగన్ ముందు తల దించే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది కాదు.
అందులోనూ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ దగ్గర పడుతున్నా, టికెట్ ధరల వ్యవహారాన్ని ఏపీ సర్కార్ ఇంకా నాన్చుతోంది గనుక, తన సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చినా, మిగిలిన పెద్ద సినిమాలకైనా ధరలు పెంచే వెసులుబాటు ఇస్తుందని తాను ముందుగానే రిలీజ్ చేసుకుంటున్నానని వైసీపీని టికెట్ ధరల విషయంలో కార్నర్ చేసే విధంగా పవన్ ఎదురుదాడి చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
ఇది ఆదివారం నాడు ఏపీలో తన భీకర స్వరాన్ని వినిపించేందుకు సిద్ధమవుతుండగా, సోమవారం నాడు తెలంగాణాలో తన “భీమ్లా నాయక్” వేడుకలో మరోసారి ప్రసంగించబోతున్నారు. ఈ వేడుకకు తెలంగాణ అధికార పార్టీ నేత, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండడంతో, ఇది కూడా రాజకీయంగా ప్రాధాన్యతను దక్కించుకుంది.
తెలంగాణాలో ‘భీమ్లా నాయక్’కు కావాల్సిన అదనపు షోల అనుమతి, టికెట్ ధరలు ఇప్పటికే సిద్ధమై ఉండడంతో, సినిమాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ వేదిక పైన కేటీఆర్ ను ప్రశంసిస్తే, పరోక్షంగా ఏపీ సర్కార్ ను మళ్ళీ తూర్పారపట్టినట్లే అవుతుంది. ఏ రకంగా చూసినా “భీమ్లా నాయక్” సినిమా అనేది రాజకీయంగా జనసైనికులను హుషారులో ముంచేదిగా కనపడుతోంది.
అందుకు తగ్గట్లే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ‘భీమ్లా నాయక్’ పోస్టర్ కూడా ఉంది. బుల్లెట్ పైన వెళ్తున్న పవన్ కళ్యాణ్ ను చూసి చుట్టూ ఉన్న జనం దండం పెడుతోన్న ఫోటో, ‘భరత్ అనే నేను, మహర్షి’ సినిమాలలో మహేష్ బాబు ఉన్న పోస్టర్స్ ను పోలి ఉన్నప్పటికీ, ‘భీమ్లా నాయక్’ పోస్టర్ మరింత మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ రేపటి నరసాపురం హోర్డింగ్స్ కు కూడా బాగా ఉపయోగపడేలా ఉంది.
After a long wait of seven years, the Student of the Year franchise is finally…
Megastar Chiranjeevi’s next release is Kaaka, directed by Bobby Kolli. The film marks the Telugu…