Telugu

భోగాపురం నుంచి విమాన సేవలు.. రేపటి నుంచే!

దాదాపు ముప్పై ఏళ్ళుగా పౌర విమానాశ్రయంగా ఉపయోగపడిన ఐఎన్ఎస్ డేగ (వైజాగ్ ఎయిర్ పోర్ట్) మళ్ళీ ఇండియన్ నేవీ అధీనంలోకి వెళ్తుంది.

అదివారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఇక్కడకు వచ్చే విమానాలన్నీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT

కానీ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు అవసరమైనప్పుడు ఐఎన్ఎస్ డేగ (వైజాగ్ ఎయిర్ పోర్ట్) నుంచి రాకపోకలు సాగించవచ్చు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడింటికి నడిబొడ్డున విజయనగరం జిల్లాలో భోగాపురం హైవేని ఆనుకొని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించినందున మూడు జిల్లాల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఇండిగో ఎయిర్ లైన్స్ హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా, తిరుపతికి తిరిగి భోగాపురానికి మొత్తం 31 సర్వీసులు నడిపించబోతోంది.

ఇక్కడి నుంచి నేరుగా సింగపూర్‌కి కూడా రేపటి నుంచే విమానసేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే మరికొన్ని విమానయాన సంస్థలు విమాన షెడ్యూల్ ప్రకటించగా, మిగిలినవి కూడా వరుసగా షెడ్యూల్స్ ప్రకటించనున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ ‘కోర్టు’లలో యుద్ధం చేస్తుందా.?

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం…

5 minutes ago

Sarrainodu Combo, But With A Bigger Game?

Whenever Allu Arjun and Boyapati Srinu are mentioned together, Sarrainodu naturally comes to mind. But…

14 minutes ago